|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రకాష్ రాజ్‌కి నాగబాబు దిమ్మతిరిగే కౌంటర్! రచ్చ రచ్చగా మారిన కామెంట్స్!!

Published: 18-04-2026, 6:05 AM
ప్రకాష్ రాజ్‌కి నాగబాబు దిమ్మతిరిగే కౌంటర్! రచ్చ రచ్చగా మారిన కామెంట్స్!!
  • ప్రకాష్ రాజ్ హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దుమారం!
  • శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగబాబు కౌంటర్ అటాక్!
  • క్రైస్తవ నాస్తికుడినని చెప్పుకున్నా తల్లి విశ్వాసాన్ని గౌరవించావన్న నాగబాబు!
  • గౌరవహీనులతో వాదనలు లేవన్న నాగబాబు.. ఇది నా సూటి వ్యాఖ్య అంటూ స్ట్రాంగ్ వార్నింగ్!

టాలీవుడ్‌లో మరో వివాదం రాజుకుంది! ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపడంతో నాగబాబు ఘాటుగా స్పందించారు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి చదవండి!

ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు..దుమారం రేపిన వివాదం!

Nagababu : ప్రకాష్ రాజ్ సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా సోషల్ మీడియాలో, బయట ఎప్పుడూ హిందూమతంపై, హిందు దేవుళ్లపై, సనాతనధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. సనాతన ధర్మం కోసం నిలబడేవాళ్లపై కూడా విమర్శలు చేస్తూ వైరల్ అవుతున్నాడు. ఇటీవల ప్రకాష్ రాజ్ హిందూ దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీంతో దేశవ్యాప్తంగా భక్తులు ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.

పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా దీనిని ఖండిస్తున్నారు. ఇప్పటికే నాగబాబు దీన్ని ఖండిస్తూ కౌంటర్ ఇవ్వగా తాజాగా ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు.

నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్!

నాగబాబు తన పోస్ట్ లో.. ప్రకాష్ రాజ్ గారు మీరు మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియలప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మీ కర్తవ్యంగా మేము గౌరవిస్తాము. అదే స్ఫూర్తితో మీరు కోట్లాది మంది నమ్మకాలను గౌరవించాలి. నాస్తికత్వం అంటే దేవుళ్ళను గానీ, విశ్వాసులను గానీ ఎగతాళి చేయడం కాదు, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం.

విశ్వాసాలను గౌరవించాలన్న నాగబాబు సలహా!

హిందూమతం మాత్రమే తన సిద్ధాంతాల ద్వారా నాస్తిక తత్వాన్ని కూడా స్వీకరించిన ఏకైక మతం. అటువంటి సంప్రదాయాన్ని తోసిపుచ్చడం హేతుబద్ధం కాదు, అది అగౌరవం. ఇతర దేశాలలో అయితే ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి ఉండేవి. మీపై ఇది నా సూటి వ్యాఖ్య భవిష్యత్తులో మీలాంటి గౌరవహీనమైన వ్యక్తులతో నేను ఎప్పటికీ వాదించను. విభిన్న విశ్వాస వ్యవస్థలను గౌరవించడమే హేతుబద్ధతకు, బాధ్యతకు నిజమైన నిదర్శనం అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాగబాబు కౌంటర్ ప్రకాష్ రాజ్‌కి గట్టిగా తాకినట్లుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.