
📌 Key Points
- శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు.
- తల్లి అంత్యక్రియలలో నమ్మకాన్ని గౌరవించినట్లే ఇతరుల నమ్మకాలను గౌరవించాలని హితవు పలికారు.
- నాస్తికత్వం అంటే నమ్మకాలను ఎగతాళి చేయడం కాదని నాగబాబు అన్నారు.
- ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందూ మతాన్ని అగౌరవపరిచేలా ఉన్నాయని నాగబాబు అభిప్రాయపడ్డారు.
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. నాస్తికత్వం అంటే దేవుడిని ఎగతాళి చేయడం కాదని ఆయన అన్నారు.
రాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్
Nagababu: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో తరచూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా శ్రీరామ లక్ష్మణల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీరాముడు(Lord Rama) వలస కూలీ అంటూ ప్రకాష్ రాజ్ (Prakash Raj)మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ తీరు పట్ల హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఈయనపై కేసులు కూడా నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలోనే ఆయనకు కౌంటర్ ఇస్తూ వచ్చారు.
ఇకపోతే మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)సైతం నిన్న ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ట్వీట్ వేశారు. రాముడిని విమర్శించిన వారు తమని తాము గాయపరచుకున్న వారు అవుతారు అంటూ ప్రకాష్ రాజ్ తీరును తప్పుపట్టారు. అయితే తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ గురించి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడు అని చెప్పుకున్నప్పటికీ ఇటీవల మీ అమ్మగారు మరణించిన సమయంలో ఆమె నమ్మకాన్ని గౌరవించి అదే విధంగానే అంత్యక్రియలు నిర్వహించారు. ఒక కొడుకుగా అది మన కర్తవ్యంగా మేము కూడా ఆ విషయాన్ని గౌరవిస్తాము. ఏ విధంగా అయితే మీరు మీ అమ్మగారి నమ్మకాన్ని గౌరవించారో అదే స్ఫూర్తితోనే కోట్లాదిమంది నమ్మకాలను కూడా గౌరవించాలని నాగబాబు సూచించారు. నాస్తికత్వం అంటే దేవుళ్లను అలాగే నమ్మకాలను ఎగతాళి చేయటం కాదని సూచించారు. అలా ఆలోచించడం హేతుబద్ధమైన ఆలోచన అంటూ తెలిపారు. తన నాస్తిక తత్వాన్ని సిద్ధాంతాల ద్వారా స్వీకరించిన ఏకైక మతం హిందూమతం. అలాంటి సంప్రదాయాలను తోసి పుచ్చడం అంటే హిందూ మతాన్ని అగౌరవపరిచినట్లేనని నాగబాబు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇతర దేశాలలో కనుక చేసి ఉంటే మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉండేవారు అంటూ ఈయన ప్రకాష్ రాజ్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నమ్మకాలను గౌరవించాలని నాగబాబు సూచన
Mr. Prakash Rai, though you call yourself a Christian atheist, you respected your mother’s faith at her funeral a gesture we honor as a son’s duty. In the same spirit, you must respect the beliefs of millions. Atheism is not mocking gods or believers,it is a rational way of…
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 18, 2026
నాస్తికత్వంపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
ఈ అంశం గురించి ఇప్పటికే ఎంతోమంది బీజేపీ నాయకులు కూడా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేయడమే కాకుండా ఈయనపై పరువు నష్టం దావా కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రకాష్ సినిమాల గురించి కాకుండా, హిందూ ధర్మం గురించి రాజకీయాల గురించి ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా తనని తొలగించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.


