|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ష‌ర్మా.. ష‌ర్మా.. హిస్ట‌రీలోనే లేని స్టోరీతో వ‌స్తున్నాడు విరాట్ కర్ణ‌! టీజ‌ర్ రిలీజ్ అప్పుడే!

Published: 15-02-2026, 12:35 AM
ష‌ర్మా.. ష‌ర్మా.. హిస్ట‌రీలోనే లేని స్టోరీతో వ‌స్తున్నాడు విరాట్ కర్ణ‌! టీజ‌ర్ రిలీజ్ అప్పుడే!
  • విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో ‘నాగబంధం’ మూవీ అప్డేట్స్!
  • నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం!
  • శివరాత్రికి టీజర్ విడుదల, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరు!
  • చరిత్ర పుస్తకాల్లో లేని కథతో వస్తున్న ‘నాగబంధం’, అంచనాలు ఆకాశాన్ని తాకేలా!

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ‘నాగబంధం’ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్! ఇది కేవలం సినిమా కాదు.. చరిత్రలో ఎవరూ చెప్పని కథ అంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

చరిత్ర పుటల్లో లేని కథతో ‘నాగబంధం’!

విరాట్ కర్ణ(Virat Karna) హీరోగా, అభిషేక్ నామా (Abhishek Nama)దర్శకత్వంలో రాబోతున్న పార్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు. ఇక శివరాత్రి పండుగ సందర్భంగా నేడు.. టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఈవెంట్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో.. తాజాగా,మూవీ మేకర్స్ కీలక నోట్ విడుదల చేశారు. ‘‘నాగబంధం (Nagabandham)టీజర్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకుని రాయడానికి ఎన్నో నెలలు పట్టింది. ఈ స్టోరీ పూర్తిగా రాసిన తర్వాతే ఊపిరిపిల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాము.

ఒక దర్శకుడిగా చెప్పాలంటే.. ఈ టీజర్ అనేది విజువల్ మాత్రమే కాదు.. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం ఆ అంతరాత్మలో దాచుకుని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ప్రేమలోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదరైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. అలసిపోయిన రాత్రులు గడిపాము. ప్రశ్నలతో నిండిన రోజులు చూశాము. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేధిస్తూ ముందుకు సాగాము. మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా.. నిలిచిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.మేము కోరుకునేది ఒక్కటూ స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్‌ను చూడండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే’’ అని రాసుకొచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది.

టీజర్ రిలీజ్.. గెస్ట్ గా సూపర్ స్టార్!

‘నాగబంధం’ టీమ్ ఎమోషనల్ నోట్ వైరల్!

‘నాగబంధం’ టీజర్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.