|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నాగబంధం’ టీజర్: మహేష్ చేతుల మీదుగా విడుదల.. అనంత పద్మనాభ నిధి రహస్యం!

Published: 15-02-2026, 3:05 AM
‘నాగబంధం’ టీజర్: మహేష్ చేతుల మీదుగా విడుదల.. అనంత పద్మనాభ నిధి రహస్యం!
  • విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో ‘నాగబంధం’ చిత్రం తెరకెక్కుతోంది.
  • మహేష్ బాబు చేతుల మీదుగా మహాశివరాత్రి సందర్భంగా టీజర్ విడుదలైంది.
  • నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.
  • అనంత పద్మనాభ దేవాలయ రహస్య నిధి నేపథ్యంలో కథ సాగుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది.

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘నాగబంధం’ టీజర్ విడుదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం అనంత పద్మనాభ దేవాలయ నిధి రహస్యం చుట్టూ తిరుగుతుంది.

మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్ విడుదల

Nagabandham Teaser:’పెద్దకాపు’ సినిమా హీరో విరాట్ కర్ణ (Virat karna) హీరోగా అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం. తాజాగా ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చేతుల మీదుగా “మహాశివరాత్రి” సందర్భంగా కాసేపటి క్రితం విడుదల చేశారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, కే జి ఎఫ్ ఫేమ్ గరుడ రామ్ , మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి 100 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.

ఇకపోతే ఈ టీజర్ విడుదల చేయడానికి రెండు గంటల క్రితం ఈ చిత్ర దర్శకుడు అభిషేక్ నామా(Abhishek Nama) ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు.” ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని.. నిశ్శబ్దంతో పోరాటం చేశామని.. మనసుకు హత్తుకునే కథతో మీ ముందుకు వస్తున్నామని, స్వచ్ఛమైన మనసుతో టీజర్ను వీక్షించండి.. మీ మనసును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే” అంటూ సినిమా టీజర్ అందరూ చూడాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఆ టీజర్ రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకుల మనసును ఈ టీజర్ తాకిందా ? అభిషేకం నామా ఆయన చిత్ర బృందం పడిన కష్టానికి ఫలితం లభించనుందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

విజువల్ వండర్ గా ‘నాగబంధం’ టీజర్

‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ మూవీ నుండి తాజాగా విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే.. ఘంటారావంతో టీజర్ ను ప్రారంభించారు. హిమాలయాలకు బౌద్ధ మతస్తులు పద్మంలో పీఠాసనం వేసుకొని కూర్చున్న మహాలక్ష్మి విగ్రహాన్ని తీసుకెళ్తూ అనంత పద్మ స్వామి దేవాలయం వైపు వెళ్తున్నట్టు చూపించారు. అక్కడ వేల కొలది పాములు.. ఆ అనంత పద్మనాభ దేవాలయ రహస్య గదికి కాపలాగా ఉన్నట్టు చూపించారు. ఇకపోతే ఎన్నో వేల సంవత్సరాలుగా అనంత పద్మనాభ దేవాలయం లో ఉన్న ఆ రహస్య నిధి గురించి తెలుసుకోవడానికి అటు శాస్త్రవేత్తలు కూడా ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దానినే బేస్ చేసుకుని ఈ కథను రూపొందించినట్లు చూసిన ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.ముసలి , హీరో ఫైట్ కూడా ఇక్కడ ఆకట్టుకుంటుంది. నిజానికి టీజర్ మాత్రం విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అనంత పద్మనాభ దేవాలయ నిధిపై సినిమా కథ

భారతదేశ చరిత్రలో ఎన్నో పురాతనమైన రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాగబంధం సాంప్రదాయంతో ముడిపడి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇదే కథను ఒక అద్భుతంలా తెరపై ఆవిష్కరించారు. 1750 నేపథ్యంలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయం, పూరీ జగన్నాథ ఆలయాల్లోని నిగూడ రహస్యాలు వాటిని రక్షించే నాగబంధం అనే ఆధ్యాత్మిక శక్తుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఇక అందులో భాగంగానే ఈ టీజర్ను ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికైతే టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్ర బృందం.. సమ్మర్ లో ఈ సినిమాతో ఎన్నో విషయాలను తెలియజేయనున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి ‘నాగబంధం’ టీజర్ ఆసక్తికరంగా ఉంది. అనంత పద్మనాభ దేవాలయ నిధి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.