|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని లెగసీపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు! పోలికే లేదంటూ తెగేసి చెప్పారా?

Published: 18-02-2026, 7:35 AM
అక్కినేని లెగసీపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు! పోలికే లేదంటూ తెగేసి చెప్పారా?
  • నాగచైతన్య తన తండ్రి లెగసీని స్ఫూర్తిగా మాత్రమే తీసుకుంటానని, పోల్చుకోనని తెలిపారు.
  • అక్కినేని వారసులుగా చైతన్య సక్సెస్ సాధించినా, అఖిల్ ఇంకా ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు.
  • నాగార్జున 100వ సినిమా షూటింగ్‌లో, నాగచైతన్య ‘వృషకర్మ’లో, అఖిల్ లెనిన్ మూవీలో బిజీగా ఉన్నారు.
  • 2027 సంక్రాంతికి ‘బంగార్రాజు 3’ సినిమాతో అక్కినేని హీరోలు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నాగచైతన్య అక్కినేని లెగసీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి నాగార్జునతో తనను పోల్చుకోనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వృషకర్మ సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు.

నాగచైతన్య కామెంట్స్ వైరల్

Nagachaitanya: నాగచైతన్య అక్కినేని వారసుడిగా జోష్ అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇలా కెరియర్ మొదట్లోనే అద్భుతమైన సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం తన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈయన అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సక్సెస్ అందుకోవడానికి కాస్త సమయమే పట్టిందని చెప్పాలి నాగచైతన్య సినీ కెరియర్ లో కూడా హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా తనని వెంటాడాయని చెప్పాలి. ప్రస్తుతం ఈయన విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ (Vrusha Karma)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అక్కినేని లెగసీ గురించి అలాగే తన తండ్రి నాగార్జున గురించి మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య అక్కినేని వారసుడిగా వచ్చినప్పటికీ ఆ వారసత్వాన్ని ఎప్పుడు తన సినిమాల కోసం ఉపయోగించుకోలేదని ఈయన తెలియచేశారు. నాన్న లెగసిని నేను కేవలం ఒక స్ఫూర్తిగా మాత్రమే చూస్తాను కానీ ఆయనతో నన్ను అసలు పోల్చుకోనని తెలిపారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నా స్వయం కృషితో ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటం కోసం ప్రయత్నాలు చేస్తున్నానంటూ ఈ సందర్భంగా నాగచైతన్య తెలియజేశారు.

అక్కినేని వారసుల సినీ ప్రయాణం

వారసత్వం అనేది కేవలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి మాత్రమే పనికి వస్తుంది కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటానికి కాదనే విషయం అందరికీ తెలిసిందే. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య మంచి సక్సెస్ అందుకున్నారు కానీ అఖిల్ మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం అక్కినేని హీరోలు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు .నాగార్జున తన ల్యాండ్ మార్క్ మూవీ 100 వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక నాగచైతన్య వృషకర్మ షూటింగ్లో బిజీగా ఉండగా అఖిల్ లెనిన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

2027 సంక్రాంతి బరిలో అక్కినేని హీరోలు..

2027 సంక్రాంతికి బంగార్రాజు 3

ఇక నాగచైతన్య నాగార్జున ఇదివరకు బంగార్రాజు, మనం అనే సినిమాలో నటించారు. ఇక 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా బంగార్రాజు 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య వృషకర్మ షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని ఈ సినిమా 2026 జూన్ లేదా జూలై నెలలో విడుదల కాబోతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తికాగానే తిరిగి బంగార్రాజు 3 పనులలో బిజీ కాబోతున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఫ్రాంచైజీస్ గా ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి అక్కినేని హీరోలు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య తన తండ్రి లెగసీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.