|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాటకి డాన్స్ చేసిన నాగార్జున, అమల (వీడియో)

Published: 08-11-2025, 9:49 AM
30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పాటకి డాన్స్ చేసిన నాగార్జున, అమల (వీడియో)

నాగార్జున, అమల కలిసి దాదాపు 30 ఏళ్ల తర్వాత శివ సినిమాలోని ‘బోటనీ పాఠముంది’ పాటకు బిగ్‌బాస్ వేదికపై స్టెప్పులేశారు. శివ సినిమా 4K రీ-రిలీజ్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Key Points

1

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'శివ' సినిమా 1989లో విడుదలైంది.

2

36 సంవత్సరాల తర్వాత 'శివ' సినిమాను 4K ఫార్మాట్‌లో తిరిగి విడుదల చేస్తున్నారు.

4

నాగార్జున, అమల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శివ సినిమా రీ-రిలీజ్ హంగామా

టాలీవుడ్(Tollywood) హిస్టరీలో రామ్ గోపాల్ వర్మ – అక్కినేని నాగార్జున శివ సినిమా(Shiva Movie)కు సపరేట్ క్రేజ్ ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే శివకి ముందు, శివ తర్వాత అని చెబుతుంటారు. 1989లో వచ్చిన ఈ సినిమా మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఓ కుదుపు కుదిపేసింది. 36 సంవత్సరాల తరువాత ఈ కల్ట్ క్లాసిక్ మూవీని 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్‌బాస్ షోకు అమల గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా శివ సినిమాలోని ‘బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా?’ అని పాటకు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియో

బిగ్‌బాస్ వేదికపై నాగార్జున – అమల డ్యాన్స్

వైరల్ అవుతున్న బోటనీ పాట డ్యాన్స్

నాగార్జున, అమలల ఈ అరుదైన డ్యాన్స్ పాత జ్ఞాపకాలను రేకెత్తించింది. శివ సినిమా అభిమానులతో పాటు నేటితరం ప్రేక్షకులను కూడా ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.