|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం: నాగ చైతన్య తండ్రి వార్తలపై నాగార్జున కీలక క్లారిటీ! అసలు నిజం ఇదే…

Published: 22-12-2025, 3:44 AM
సంచలనం: నాగ చైతన్య తండ్రి వార్తలపై నాగార్జున కీలక క్లారిటీ! అసలు నిజం ఇదే...
  • నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడనే వార్తలపై నాగార్జున స్పష్టతనిచ్చారు.
  • కోడలు శోభిత ధూళిపాళపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.
  • కుటుంబంలో శుభవార్త ఉంటే స్వయంగా ప్రకటిస్తామని నాగార్జున వెల్లడి.
  • నాగ చైతన్య ప్రస్తుతం ‘వృషభకర్మ’ పాన్ ఇండియా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలపై కింగ్ నాగార్జున ఎట్టకేలకు స్పందించారు. ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇస్తూ, కోడలు శోభితను ప్రశంసించారు. తమ కుటుంబంలో శుభవార్త ఉంటే తామే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

నాగ చైతన్య తండ్రి వార్తలపై నాగార్జున క్లారిటీ

Nagarjuna: సోషల్ మీడియాలో కొంతకాలంగా నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇదే విషయాన్ని నాగ చైతన్య తండ్రి నాగార్జునను అడిగారు రిపోర్టర్స్. దానికి సమాధానంగా నాగార్జున మాట్లాడుతూ “సమయం వచ్చినప్పుడు మేమె చెప్తాము” అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నాగార్జునకి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. నాగార్జున(Nagarjuna) చెప్పున సమాధానాన్ని తప్పుగా అర్థంచేసుకున్న కొంతమంది నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అనే వార్తలను మళ్ళీ వైరల్ చేయడం మొదలుపెట్టారు.

Naga Chaitanya: శోభిత-సమంతతో నాగ చైతన్య.. వైరల్ అవుతున్న పిక్

కోడలు శోభితపై నాగార్జున ప్రశంసలు

ఈ విషయంపై తాజాగా మరోసారి స్పందించాడు నాగార్జున. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ తన కోడలు శోభితపై ప్రశంసలు కురిపించాడు. తండ్రి కావడం అనేది, ఒక కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది ఎవరికైనా చాలా స్పెషల్ మూమెంట్. ఇలాంటి విషయాల గురించి వార్తలు రాసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. శోభిత మా ఇంట్లో అడుగుపెట్టాక ఎంతో సంతోషం వచ్చింది. తాను ప్రతీ విషయంలో చాలా పాజిటీవ్ గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనది. తన రాకతో మా జీవితాలు సంతోషంతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాతయ్యను చేసే గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే మేమె స్వయంగా ప్రకటిస్తాము”అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో, నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.

నాగ చైతన్య కొత్త సినిమా అప్డేట్స్

ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాగార్జున ఇచ్చిన ఈ స్పష్టతతో నాగ చైతన్య తండ్రి వార్తలకు తెరపడింది. అభిమానులు ఇప్పుడు చైతూ, శోభితల కుటుంబం నుండి వచ్చే అధికారిక ప్రకటనల కోసం, అలాగే చైతన్య ‘వృషభకర్మ’ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.