
టాలీవుడ్ స్టార్ నాగార్జున తాజాగా విడుదలైన ‘కుబేర’ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని, సినిమా గురించి, తన నటన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ధనుష్ నటనపై ఆయన అభిప్రాయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Key Points
నాగార్జున గారు కుబేర సినిమాలోని తన అనుభవాన్ని పంచుకున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వం గురించి నాగార్జున ప్రశంసలు కురిపించారు.
కుబేర సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిపారు.
కుబేర సినిమా సక్సెస్ మీట్
టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కుబేర . శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర తాజాగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అయితే, ఇటీవల నిర్వహించిన కుబేర సక్సెస్ మీట్‌లో నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ .. “అందరికీ నమస్కారం. మై బ్రదర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ. ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారిని ఎంతగానో ప్రేమిస్తుంది. విక్రమ్ సినిమా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించారు” అని అన్నారు.
” అమీర్ ఖాన్ గారు హిందీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సినిమాని పక్కనుండి సపోర్ట్ చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదైనా కావచ్చు.. సపోర్ట్ చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది” అని నాగార్జున తెలిపారు.
నాగార్జున కామెంట్స్
“ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్‌తో హ్యూమన్ ఎమోషన్‌తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమాలో దీపక్ దేవా సమీరా ఇలా అన్ని పాత్రలే తప్పా స్టార్స్ కనిపించరు. ఈ సినిమా దేవ సినిమా.. దీపక్ సినిమా.. సమీరా సినిమా.. కుష్బూ సినిమా… ఇట్స్ బిలాంగ్స్ టు శేఖర్ కమ్ముల. ఆయనకి థాంక్యూ” అని నాగార్జున చెప్పారు.
“నాకు తెలియని యాక్టింగ్ ఏదో ఇందులో ఆయన (శేఖర్ కమ్ముల) నేర్పించారు (నవ్వుతూ). నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు కొత్తగా ఉండేది. చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు ‘చాలా బాగా చేశావు దీపక్ అయిపోయావు’ అన్నారు. అప్పుడు నాకు శేఖర్ కమ్ముల గొప్పతనం అర్థమైంది” అని కింగా నాగ్ గుర్తు చేసుకున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వం
“ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సునీల్ గారు నాకు బ్రదర్ లాంటివారు. రామ్మోహన్ గారు, జాన్వి అందరూ చాలా వెరీ స్వీట్ పర్సన్స్. నికిత్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. దేవి శ్రీ మ్యూజిక్ ఫెంటాస్టిక్. ఈ సినిమా మీడియాకు నచ్చింది. ఆడియన్స్‌కి నచ్చింది. ఎక్కడ కూడా మూడు రేటింగ్ కంటే తక్కువ ఇవ్వలేదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి మిరాకిల్‌ని శేఖర్ క్రియేట్ చేశాడు” అని నాగార్జున వెల్లడించారు.
” ధనుష్ ని సెట్‌లో అసలు పోల్చుకోలేకపోయా. సినిమా అంతా దేవా క్యారెక్టర్‌లోనే ఉన్నారు. అలా ఉండడం అంత ఈజీ కాదు. రష్మిక ని చూస్తే క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారు. ఈ సినిమాలో తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ సినిమా నాలో కొత్త వరల్డ్‌ని ఓపెన్ చేసింది. మరో 40 ఏళ్లు తిరుగుండదు. ఐ లవ్ యు ఆల్” అని నాగార్జున తన స్పీచ్ ముగించారు.
కుబేర సినిమా విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలకు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. సినిమా యొక్క విజయం అందరినీ ఆకట్టుకుంది.


