|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివంగత స్టార్ హీరోయిన్‌‌తో రష్మిక మందన్నను పోల్చుతూ ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగార్జున?

Published: 23-06-2025, 7:14 AM
దివంగత స్టార్ హీరోయిన్‌‌తో రష్మిక మందన్నను పోల్చుతూ ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగార్జున?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున చేసిన రష్మిక మందన్న గురించిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Key Points

1

నాగార్జున రష్మిక మందన్నను శ్రీదేవితో పోల్చారు.

2

కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ కామెంట్స్ చేశారు.

4

వైరల్ అవుతున్న వీడియోలో ఈ కామెంట్స్ ఉన్నాయి.

నాగార్జున కామెంట్స్ వైరల్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. జూన్ 20 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ మూవీలో నాగార్జున అండ్ ధనుష్ ముఖ్య పాత్రల్లో నటించి అదిరిపోయే ఫార్మామెన్స్‌ ఇచ్చారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా మెరిసింది. ఇక జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దీంతో విడుదలకు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

అయితే రిలీజ్‌కు ముందు కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నాగార్జున.. ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలుతోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏకంగా ఈ ముద్దుగుమ్మను నాగ్ దివంగత స్టార్ హీరోయిన్‌ శ్రీదేవితో పోల్చి మాట్లాడారు. అలాగే రష్మికను చూస్తే క్షణక్షణంలో శ్రీదేవి గుర్తు వచ్చారని వెల్లడించారు. ఇప్పుడు నేషనల్ క్రష్ మాత్రమే కాదు.. నా క్రష్ అని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్

రష్మిక మందన్న – శ్రీదేవి పోలిక

కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున చేసిన రష్మిక మందన్న గురించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రష్మికకు శ్రీదేవితో ఉన్న పోలికను ఆయన ఎత్తిచూపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.