
ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా, నటుడు నాగార్జున గారు మోడీ గారితో తన తొలి సమావేశం గురించి, ఆయన మంచితనం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
Key Points
నాగార్జున గారు 2014లో తొలిసారిగా మోడీ గారిని గాంధీనగర్‌లో కలిశారు.
మోడీ గారు నాగార్జున గారి వినయం గురించి మాట్లాడారు.
నాగార్జున గారి కుటుంబ సభ్యులు మోడీ గారితో మైసూరులో కలిశారు.
మోడీ గారి మన్ కీ బాత్‌లో ఏఎన్నార్ గారి గురించి ప్రస్తావించడంపై నాగార్జున గారు సంతోషం వ్యక్తం చేశారు.
నాగార్జున-మోడీ మొదటి సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు సెప్టెంబర్ 17 బుధవారం రోజు తన 75 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం సినీ రాజకీయ ప్రముఖులు ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా మోడీకి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో సాన్నిహిత్యం ఉన్న టాలీవుడ్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. నాగార్జున సందర్భం వచ్చిన ప్రతిసారి మోడీ గురించి మంచి విషయాలు చెబుతుంటారు.
మోడీ బర్త్ డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ నాగార్జున సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు ఈ వీడియోలో నాగార్జున తాను తొలిసారి మోడీని ఎప్పుడు ఎలా కలిసింది ? మోడీతో తన సాన్నిహిత్యం ఎలాంటిది ? లాంటి విషయాలని రివీల్ చేశారు.
As Shri @narendramodi ji approaches his 75th birthday, I look back at my very first meeting with him in 2014 — a moment of inspiration, kindness & life lessons. Wishing him an early happy birthday with prayers for his good health & continued leadership. #MYMODISTORY #ModiAt75 … pic.twitter.com/Ycimd66sMd
మోడీ గారి నుండి నాగార్జున గారికి ఆశ్చర్యం
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 16, 2025
నాగార్జున మాట్లాడుతూ 2014లో తాను తొలిసారి మోడీని గాంధీనగర్ లో మీట్ అయినట్లు తెలిపారు. ఆయనకి నేను పెద్ద అభిమానిని. గుజరాత్ ని ఎంతగా అభివృద్ధి చేశారో అప్పుడే తెలుసుకున్నాను. మోడీని కలవడానికి పిలుపు వచ్చినప్పుడు చాలా సంతోషించాను. ఆయన నా గురించి చెప్పిన ఒక విషయం విని ఆశ్చర్యపోయాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది మిమ్మల్ని మైసూరులో కలిశారు అని మోడీ అన్నారు. సౌత్ స్టార్ నాగార్జునని మీట్ అయినట్లు వాళ్ళు నాతో చెప్పారు.
ఏఎన్నార్ గారి గురించి మోడీ గారి ప్రస్తావన
ఫ్యామిలీ లో చిన్న పిల్లలు మీతో ఫోటో కావాలని అడిగారు. వాళ్ళు మీకు ఎవరో తెలియనప్పటికీ, మీ చుట్టూ సెక్యూటిరీ ఉన్నప్పటికీ ఎంతో వినయంగా ఫోటో అవకాశం ఇచ్చారని తెలిపారు. వాళ్ళ మాటల్లో మీ మంచితనం తెలుసుకున్నాను. అదే వినయం ఎప్పుడూ కొనసాగించండి. మనిషికి కావలసింది అదే అని మోడీ నాతో అన్నారు. మన్ కీ బాత్ లో మోడీ గారు మా నాన్న ఏఎన్నార్ గారి గురించి చెప్పినట్లు చాలా సంతోషంగా అనిపించింది.
మోడీ గారు మరోసారి ఈ దేశానికి సేవలందించాలి. దేశం కోసం మోడీ తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో త్యాగాలు చేశారు. ఇండియాని గొప్ప దేశంగా తీర్చి దిద్దడమే మోడీగారి లక్ష్యం అని నాగార్జున అన్నారు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అని నాగార్జున తెలిపారు.
నాగార్జున గారితో మోడీ గారి అనుబంధం, మోడీ గారి మంచితనం గురించి వెల్లడించే ఈ కథనం, ప్రధాని మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలతో ముగుస్తుంది.


