|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ సీక్రెట్: టెన్షన్స్ మాయం చేయడానికి నాగ్ ఏం చేస్తాడో తెలుసా? వైరల్ న్యూస్!

Published: 19-02-2026, 3:35 AM
షాకింగ్ సీక్రెట్: టెన్షన్స్ మాయం చేయడానికి నాగ్ ఏం చేస్తాడో తెలుసా? వైరల్ న్యూస్!
  • కింగ్ నాగార్జున ఫిట్ నెస్, గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీ!
  • చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో టాలీవుడ్ పిల్లర్ గా నాగార్జున!
  • హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా నాగార్జున సక్సెస్.. భారీ బిజినెస్ సామ్రాజ్యం!
  • టెన్షన్స్ తగ్గించుకోవడానికి.. కూల్ గా ఉండటమే నా సక్సెస్ మంత్రం అంటున్న నాగ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ఒక సంచలన వార్త! 66 ఏళ్ల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఎలా రాణిస్తున్నారో తెలుసా? ఆయన ఫిట్నెస్, గ్లామర్ సీక్రెట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న నాగార్జున ఫిట్నెస్!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 66 ఏళ్ల వయసులో కూడా.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఫిట్ నెస్ కానీ, గ్లామర్ విషయంలో కానీ.. ఏమాత్రం తగ్గడంలేదు సినిమాల విషయంలో కాస్త వెనుకపబడి ఉన్నా.. స్టార్ డమ్, ఇమేజ్ విషయంలో నాగర్జునకు వచ్చిన ఇబ్బందేమి లేదు. టాలీవుడ్ కు చిరంజీవి, బాలకష్ణ, వెంకటేష్ తో పాటు.. నాగార్జున కూడా కలిసి నాలుగు పిల్లర్లమాదిరిగా నిలిచారు. ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తూ.. అద్భుతం చేస్తున్నాడు కింగ్.

తెలుగు పరిశ్రమలో నాగార్జున హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీని దాటుకుని నాగార్జున సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా కూడా సత్తా చాటాడు. ఎన్నో బిజినెస్ లు చేస్తూ.. టాలీవుడ్ లోనే రిచ్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని రిచ్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు.

కూల్ గా ఉండటమే నా సక్సెస్ మంత్రం అంటున్న కింగ్!

హీరోగా సినిమాలు చేస్తూ.. బిజినెస్ లను కూడా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాడు? వాటి వల్ల వచ్చిన ఒత్తడిని ఎలా తట్టుకుంటారు? అన్ని బాధ్యతలు ఉన్నా… అంత ప్రశాంతం.. కూల్ గా, గ్లామర్ గా ఉండటం ఎలా సాధ్యం అయ్యింది.

ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున ఆయన హెల్త్ సీక్రేట్ ను వెల్లడించారు. నాగార్జున మాట్లాడుతూ.. ” నికు కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. రోజు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ వాటిని తలుచుకుని బాధపడుతూ కూర్చోలేము కదా..? కెరీర్ లో ఎన్నో నష్టాను చూశాను.. కొన్ని భారీ లాసులు కూడా ఫేస్ చేశాను. కానీ వాటి విషయంలో ఎక్కువగా ఆలోచించను. ఆలోచిస్తే.. మైండ్ డిస్ట్రబ్ అవుతుంది, హెల్త్ డిస్ట్రబ్ అవుతుంది. అందుకే అవేమి పట్టించుకోను” అని నాగార్జున వెల్లడించారు.

హీరోగా, నిర్మాతగా నాగార్జున సక్సెస్ సీక్రెట్స్!

కింగ్ నాగార్జున ఇంత ఎన్జిటిక్ గా, యంగ్ లుక్ లో ఉండటానికి కారణాలు ఏంటీ అనేది.. చాలా సందర్భాల్లో వెల్లడించారు. ముఖ్యంగా కూలీ సినిమా సమయంలో రజినీకాంత్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడు నాగార్జున మాట్లాడుతూ.. ” నేను ఇలా ఉండగలగడానికి కారణం ఎప్పుడూ కూల్ గా ఉండమే. దేనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వను. మా నాన్నగారు ఇదే విషయాన్ని చెప్పారు. ఏది జరిగినా.. అది నువ్వు మార్చలేవు. జరిగేది జరుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయాలి.. కాని హోప్ మాత్రం పెట్టుకోవద్దు. దేనికి ఎక్కువ రియాక్ట్ అవ్వొద్దు. సక్సెస్ కానీ… ఫెయిల్యూర్ కానీ.. ఏది అతిగా తీసుకోవద్దు.. అలా తీసుకోకపోవడం వల్లే.. ఇలా ఉండగలుగుతున్నాను.” అని అన్నారు.

ప్రస్తుతం నాగార్జున తన 100 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేదు కింగ్ కు. అందుకోసం గట్టిగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఈసారి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. సినిమాలు లేకున్నా.. బిగ్ బాస్ ద్వారా నాగార్జున స్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా దాదాపు 7 ఏళ్లుగా కొనసాగుతున్నాడు నాగ్. హీరోగానే కాదు.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ.. వస్తున్నాడు. కూలి, కుబేర సినిమాల్లో నాగార్జున పాత్రలకు మంచి పేరువ వచ్చింది.

నాగార్జున తన జీవితంలోని ఒత్తిడిని ఎలా జయిస్తాడో తెలుసుకున్నారు కదా. ఆయన సక్సెస్ మంత్రం చాలామందికి స్ఫూర్తిదాయకం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.