|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీక్రెట్ చెప్పమన్న నాగార్జున- తనకు తానే ఇరుక్కున్న సీరియల్ హీరోయిన్- నాగ్ ముద్దులు- బయటపడిన కాఫీ షాప్ లవ్ ట్రాక్

Published: 22-09-2025, 1:10 AM
సీక్రెట్ చెప్పమన్న నాగార్జున- తనకు తానే ఇరుక్కున్న సీరియల్ హీరోయిన్- నాగ్ ముద్దులు- బయటపడిన కాఫీ షాప్ లవ్ ట్రాక్

బిగ్ బాస్ తెలుగు 9లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో ఆసక్తికరమైన ఆటలు ఆడుతున్నాడు. తాజా ఎపిసోడ్‌లో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ తన లవ్ ట్రాక్ గురించి రివీల్ చేసింది. నాగార్జున చేసిన ఫన్నీ యాక్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Key Points

1

నాగార్జున బిగ్ బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్లతో ఫన్నీ ఆటలు ఆడాడు.

2

సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ తన ప్రేమ గురించి ఒక సీక్రెట్ బయటపెట్టింది.

4

మనీష్ మర్యాద బిగ్ బాస్ తెలుగు 9 నుండి ఎలిమినేట్ అయ్యాడు.

బిగ్ బాస్ 9లో నాగార్జున ట్విస్ట్

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ బాగా జరుగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీల ప్రక్రియ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై రివ్యూ లు, సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలా నిన్న శనివారం నాటి ఎపిసోడ్‌లో ఓనర్స్‌ని టెనంట్స్‌గా, టెనంట్స్‌ను ఓనర్స్‌గా మార్చి ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున.

ఇక తాజాగా ఆదివారం అంటే ఇవాళ్టీ (సెప్టెంబర్ 21) ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్లతో ఫన్ క్రియేట్ చేశాడు. ఇవాళ తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు 9 ప్రోమో ఆకట్టుకుంటోంది. డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సీరియల్ హీరోయిన్ తనూజ గౌడను లేపి “ఇప్పటిదాకా కిచెన్‌లో ఏం చేస్తున్నావ్” అని అడిగాడు.

దానికి “ప్లీజ్ నాగ్ సర్ ఒక చిన్న కాఫీ పౌడర్ ఇప్పించండి” అంటూ తనూజ వేడుకుంది. “ఒక చిన్న సీక్రెట్ చెబితే” అని నాగ్ మామ అడిగాడు. దానికి “అమ్మో నేనే ఇరుక్కున్నాను” అని తనూజ అంది. “నాకు అంత ఈజీగా క్రష్ అనేది, లవ్ అనేది అవ్వదు. నా హో..” అనుకుంటూ గుండె బరువు అయినట్లుగా పట్టుకుంది తనూజ.

తనూజ గౌడ సీక్రెట్ లవ్ ట్రాక్

నాగార్జున కూడా అలాగే చేశాడు. “నేను ఒకరిని కలిసాను. కాఫీ షాప్‌లో” అని తనూజ చెప్పింది. అలా నాగార్జున హీరోయిన్ తనూజ గౌడ కాఫీ షాప్ లవ్ ట్రాక్‌ను బయటపడేలా చేశాడు. తర్వాత ఇమ్మాన్యుయెల్ ఏదో అంటే “ఇమ్మూ నువ్వు ఫోన్‌లో మాట్లాడిన రమేష్ గురించి కాదు మ్యాటర్” అని నాగార్జున అన్నాడు.

“రమేష్ ఎవరు” అని ఆశ్చర్యంగా అడిగింది తనూజ గౌడ . దానికి ఫోన్‌లో ముద్దులు పెడుతున్నట్లుగా కింగ్ నాగార్జున కిస్సెస్ పెట్టాడు. దానికి ఇమ్మాన్యుయెల్, మిగతా కంటెస్టెంట్స్ నవ్వితే.. తనూజ గౌడ మాత్రం సిగ్గుపడిపోయింది. తర్వా ఓనర్స్‌కి టెనంట్స్‌ లిరికల్ కాంపిటీషన్ జరుగుతుందని చెప్పి అది చేయించాడు హోస్ట్ నాగార్జున.

మనీష్ మర్యాద ఎలిమినేషన్

సాంగ్ లిరిక్స్ వస్తుంటాయి. ఆ పాట ఒక చోట ఆగాక ఆ తర్వాత వచ్చే లిరిక్స్‌ను కంటెస్టెంట్స్ చెప్పాలి. అలా ఎవరు ఎక్కువగా చెబితే వారు గెలిచినట్లు. అలా గెలిచిన వారికి ఏదో ఒక ప్రైజ్ ఇస్తుంటారు.

ఇకపోతే బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యాడు. ఈ ప్రక్రియను ఇవాళ్టీ బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 21 ఎపిసోడ్‌లో ప్రసారం చేయనున్నారు. మర్యాద మనీష్ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉంటారు.

బిగ్ బాస్ తెలుగు 9 రెండవ వారం ముగిసింది. మనీష్ మర్యాద ఎలిమినేషన్ తో, ఇప్పుడు 13 మంది కంటెస్టెంట్లు మిగిలారు. తనూజ గౌడ సీక్రెట్ బయటపడటంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.