
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునను ప్రశంసిస్తూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. ‘శివ’ సినిమా రీరిలీజ్ సందర్భంగా నాగార్జున సినీ ప్రస్థానం, ఆయన నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ‘శివ’ తెలుగు సినిమాను పునర్నిర్వచించిందని పేర్కొన్నారు.
Key Points
టాలీవుడ్ నటుడు నాగార్జునను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు.
నాగార్జున నటించిన 'శివ' చిత్రం 4K విజువల్స్‌తో రీరిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'శివ' తెలుగు సినిమాను పునర్నిర్వచించిందని, నాగార్జున నటుడిగా గొప్పగా మెప్పించారని మంత్రి పేర్కొన్నారు.
ANR వారసత్వాన్ని కొనసాగిస్తూ, నాగార్జున సినీ ప్రయాణం తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుందని మంత్రి కొనియాడారు.
మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునను ప్రశంసిస్తూ .. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ట్వీట్ చేశారు . నాగార్జున నటించిన శివ సినిమా నేడు రీరిలీజ్ కానున్నడంతో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు . తెలుగు సినీ చరిత్రలో ‘శివ’ ఒక కల్ట్ క్లాసిక్ అని తెలిసిందే . అత్యాధునిక హంగులతో, 4కె విజువల్స్‌తో మరోసారి ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది . దీంతో ఇప్పటికే చిరంజీవి , రాజమౌళి , ఎన్టీఆర్ , ప్రభాస్ , మహేష్ బాబు వంటి స్టార్స్ కూడా శివ గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు . ఈ క్రమంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా చెప్పుకొచ్చారు .
‘ ప్రియమైన నాగార్జున .. శివ తెలుగు సినిమాను పునర్నిర్వచింది . ఒక నటుడిగా ఇందులో మీరు ఎంతో గొప్పగా మెప్పించారు . మిమ్మల్ని మరోకరు అందుకోలేరు . ANR గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ .. సినిమా పరిశ్రమ పట్ల మీ నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. శివ సినిమా రీరిలీజ్ సందర్భంగా, మీకు నా శుభాకాంక్షలు. శివ నుంచి అన్నమయ్య, షిర్డీ సాయితో పాటు నాకు ఎంతో ఇష్టమైన భక్త రామదాసు వంటి దివ్యమైన చిత్రాలతో మీ ప్రయాణం తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది . శివ మరోసారి గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను .’ అని మంత్రి పేర్కొన్నారు .
‘శివ’ రీరిలీజ్ – ఒక కల్ట్ క్లాసిక్
నాగార్జున సినీ ప్రస్థానం – స్ఫూర్తిదాయకం
మంత్రి కోమటిరెడ్డి ట్వీట్ నాగార్జున అద్భుతమైన సినీ ప్రస్థానాన్ని, ‘శివ’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రం తెలుగు సినిమాపై చూపిన ప్రభావాన్ని మరోసారి గుర్తుచేసింది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఆయన నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.


