|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పనులు చేపిస్తున్నాం.. సంచలన నిజాలు బయటపెట్టిన నాగవంశీ (వీడియో)

Published: 21-07-2025, 3:06 AM
వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పనులు చేపిస్తున్నాం.. సంచలన నిజాలు బయటపెట్టిన నాగవంశీ (వీడియో)

టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సినిమాల ప్రమోషన్లలో జరిగే అక్రమాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Key Points

1

నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

సినిమా రేటింగ్స్, లైకులు పెంచడానికి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

4

తప్పుడు ప్రమోషన్‌ను నివారించేందుకు గిల్డ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మీడియాతో సరైన సంబంధాలు లేకుంటే ఒక సినిమాను చంపేస్తారనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15 ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుంది.

సినిమా ప్రమోషన్స్‌లో డబ్బుల ఖర్చు

ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పీఆర్ టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. విడుదల తర్వాత రేటింగ్, లైకులు, మంచి రివ్యూల కోసం ఏకంగా రూ. 30 లక్షలకు పైగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు కింగ్‌డమ్ రూ. 130 కోట్లు పెట్టి తీశాను. అలాంటప్పుడు రూ. 30 లక్షల గురించి ఆలోచించాలా? అని మా టెన్షన్స్‌తో డబ్బులు పట్టించుకోవడం లేదు. ‘కింగ్‌డమ్’ ప్రోమో వచ్చింది. అన్ని వెబ్‌సైట్స్ బాగా రాశారు. నిజం చెప్పాలంటే.. ఆ కంటెంట్ బాగుండి రాశారా లేక పీఆర్ఓలు రాయించారా అనేది ఎవరికీ తెలియదు.

బుక్‌మైషో లైకులు, రేటింగ్స్

కానీ మేమే రాపించామని చెబుతున్నారు. బుక్‌మై షోలో మీకు కనిపించే లైక్స్, రేటింగ్స్ కూడా డబ్బులు ఇచ్చి చేపిస్తాం. అందుకే ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్డ్‌లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బుక్‌మైషో వాడికి అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఏమైనా అంటే భయం క్రియేట్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

చివరగా, నాగవంశీ వెల్లడించిన విషయాలు టాలీవుడ్ ప్రమోషన్స్ పై తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై పరిశ్రమలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.