|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

Published: 06-12-2025, 8:08 AM
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
  • నగ్మ 10 భాషల్లో 90 కి పైగా సినిమాలు చేసింది.
  • చిరంజీవి, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
  • 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా రాజకీయాల్లో కొనసాగుతోంది.
  • ఆమె చెల్లెలు జ్యోతిక స్టార్ హీరోయిన్, సూర్యను వివాహం చేసుకుంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోలతో నటించి మెప్పించిన నటి నగ్మ. 10 భాషల్లో 90కి పైగా సినిమాలు చేసిన ఆమె, 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. ఆమె సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలపై ఈ కథనం.

నగ్మ అద్భుత సినీ కెరీర్

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోయిన హీరోయిన్, వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పొలిటికల్ కెరీర్ ను కొనసాగిస్తోంది. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గా కొనసాగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు నగ్మ. తన కెరీర్‌లో సక్సెస్‌ తో పాటు పలు అఫైర్ల రూమర్లు కూడా చూసిన నగ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 10 భాషల్లో 90 కి పైగా సినిమాలు చేసింది నగ్మ. అంతేకాదు సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఆమె స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆమె, బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ సంపాదించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ హీరోలతో నటించి క్రేజ్‌ తెచ్చుకుంది. ’భాషా’, ’రౌడీ అల్లుడు’, ’రిక్షావోడు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుంది. సౌత్ ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, నగ్మకు ఓ అభిమాని గుడి కూడా కట్టాడు.

వ్యక్తిగత జీవితంలో ఒంటరి నగ్మ

నగ్మ ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ – హిందూ, తల్లి షామా – కాజీ ముస్లిం. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి కుటుంబం స్వాతంత్ర్య సమరయోధుల నేపథ్యం కలిగింది. షామా–అరవింద్ 1969లో వివాహం చేసుకున్నారు. నగ్మ పుట్టిన సమయంలోనే ఆమె తల్లీ తండ్రులు విభేదాల కారణంగా 1974లో విడిపోవగా, తర్వాత షామా సినీ నిర్మాత చందర్ సదానాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జ్యోతిక, రోషిణి (రాధిక) అనే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.

నగ్మ చెల్లెల్లు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు గా కొనసాగాయారు. మరీ ముఖ్యంగా నగ్మ మొదటి చెల్లెలు జ్యోతిక సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నగ్మ రెండో చెల్లెలు రోషిణి కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. మరోవైపు నగ్మ గురించి చూసుకుంటే తన కెరీర్ ప్రారంభ దశ నుంచి తండ్రికే ఎక్కువగా దగ్గరగా ఉండేది. 2005లో ఆయన మరణించే వరకు ఆయనతో నగ్మ ఎక్కువ సమయం గడిపింది.

నగ్మ కుటుంబ నేప‌థ్యం, జ్యోతిక

నగ్మ ఫిల్మ్ కెరీర్ లో పెద్దగా ప్లాప్ సినిమాలు లేవు. ఆమెకు హీరోయిన్ గా కెరీర్ పూర్తి అవ్వగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన ఆమె.. ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. ఆమె స్టార్‌డమ్ పీక్‌లో ఉన్న సమయంలో క్రికెటర్ సౌరవ్ గంగూలీతో అఫైర్ రూమర్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. మరో ఇద్దరు స్టార్లతో కూడా ఆమె పేరు వినిపించింది. కానీ అవి నిజమా కాదా అనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం నగ్మ రాజకీయాల్లో బిజీగా ఉంటూ, ఒంటరి జీవితం గడుపుతోంది.

నగ్మ సినీ ప్రస్థానం, ఆమె వ్యక్తిగత జీవితం ఎందరికో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒకవైపు స్టార్‌డమ్ అనుభవిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకోకుండా తనదైన మార్గంలో కొనసాగుతున్న ఆమె ప్రయాణం నిజంగా విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.