
డ్యాన్స్ షోలతో పాపులర్ అయిన నైనిక, బిగ్ బాస్ షో ద్వారా మరింత ప్రఖ్యాతిని పొందింది. తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను, తన తండ్రి చేసిన హింసను వెల్లడించింది.
Key Points
నైనిక తన తండ్రి గురించి తొలిసారిగా బహిరంగంగా మాట్లాడింది.
ఆమె తండ్రి కుటుంబంలో హింసను కలిగించాడని ఆరోపించింది.
అతనితో వేరుగా ఉండాలని, తన తల్లిని కాపాడుకోవాలని నిర్ణయించుకుందని తెలిపింది.
బిగ్ బాస్ షో తర్వాత నైనిక జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి వివరించింది.
నైనిక తండ్రి గురించి వెల్లడించిన విషయాలు
Nainika : డ్యాన్స్ షో ఢీతో ఫేమ్ తెచ్చుకుంది నైనిక. ఆ తర్వాత సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని నైనిక మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ డ్యాన్స్ మాస్టర్ గా, ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చేస్తుంది నైనిక.(Nainika)
తాజాగా నైనిక ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మీరెప్పుడూ మీ అమ్మ గురించే చెప్తారు, ఆమెతోనే కనిపిస్తారు. మీ నాన్న గురించి చెప్పరు ఎందుకు అని ప్రశ్నించారు.
కుటుంబ హింసను ఎదుర్కొన్న అనుభవం
నైనిక నిర్ణయం మరియు భవిష్యత్తు
నైనిక సమాధానమిస్తూ.. ఆయన మాతో ఉండరు. నాన్న డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. నేను ఆయన్ని మిస్ అవ్వను. ఆయన మా అమ్మని టార్చర్ చేయడం చూసాను. నాకు మా అమ్మ అంటే ఇష్టం. అందుకే ఆయన మా అమ్మ కోసం ఏం చేయనవసరం లేదు, మా ఫ్యామిలీకి మీరొద్దు వెళ్లిపోండి అని చెప్పేసాను అని తెలిపింది.
నైనిక తన కష్టకాలను బహిరంగపరిచి, తన తల్లిని కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఆమె ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కుటుంబ హింస బాధితులకు మద్దతు అవసరం.


