
వినాయక చవితి రోజున, సూపర్ స్టార్ మహేష్ బాబు లేకుండా నమ్రత శిరోద్కర్ తన పిల్లలతో పండుగను జరుపుకుంది. SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబును ఎంతో మిస్ అవుతున్నానని ఆమె వెల్లడించింది.
Key Points
నమ్రత శిరోద్కర్ వినాయక చవితిని పిల్లలతో జరుపుకుంది.
మహేష్ బాబు లేకపోవడంతో ఆయనను ఎంతో మిస్ అవుతున్నానని నమ్రత పేర్కొంది.
మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
నమ్రత, పిల్లలతో వినాయక చవితి
పండగ రోజు తన భర్త సూపర్ స్టార్ మహేష్ బాబును నమత్ర శిరోద్కర్ ఎంతో మిస్ అయ్యారు. ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో ఉన్న మహేష్ బాబు వినాయక చవితి రోజు కుటుంబంతో కలిసి టైమ్ ను గడపలేకపోయారు. దీంతో తమ పిల్లలు గౌతమ్, సితారాతో కలిసి నమత్ర పండగ సెలబ్రేట్ చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేనితో కలిసి వినాయక చవితి జరుపుకుంటూ తీసిన చిత్రాలను నమ్రత పంచుకున్నారు. మహేష్ బాబు లేకుండా నమ్రత శిరోద్కర్ గణేష్ చతుర్థి ని జరుపుకున్నారు. మొదటి ఫోటోలో నమ్రత శిరోద్కర్, సితార, గౌతమ్ కలిసి నిలబడి కెమెరాకు పోజులిచ్చారు. మరో ఫోటోలో నమ్రత తన పెంపుడు కుక్కతో కనిపించింది.
మహేష్ బాబును మిస్ అవుతున్నానని నమ్రత
పండగ కోసం నమ్రత నారింజ రంగు చీర ధరించగా, సితార బేజ్, బంగారు రంగు దుస్తులు ధరించింది. గౌతమ్ నల్లటి టీ-షర్టు, తెల్లని షార్ట్స్ వేసుకున్నాడు. మహేష్ బాబు ను మిస్ అవుతున్నానని నమ్రత రాశారు. “బప్పా ఇంటికి వచ్చాడు. మేమందరం సంతోషంగా ఉన్నాం. అందరికీ ప్రేమ, శాంతి, సంపదలు కలగాలని కోరుకుంటున్నా! మహేష్ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నా(ఎరుపు హృదయం ఇమోజీలు). అందరికీ శుభ గణేష్ చతుర్థి’’ అని పోస్టు చేసింది.
నమ్రత పోస్ట్‌కు అభిమానులు రియాక్టయ్యారు. ఆమె సోదరి, నటి శిల్పా శిరోద్కర్ “గణపతి బప్పా మోర్యా” అని రాసుకొచ్చారు. “అందమైన ఫోటో. మహేష్ బాబు కూడా అక్కడ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో అవుతుంది. మేము కూడా ఆయనను ఎంతో మిస్ అవుతున్నాం” అని ఓ ఫ్యాన్ కామెంట్ చేశాడు. “అతను ఎక్కడ ఉన్నాడు? షూటింగ్‌లోనా?” అని మరొకరు ప్రశ్నించారు.
సితార ఘట్టమనేని లేటెస్ట్ లుక్
మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ29 (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి గ్లోబల్ ట్రాటర్ అనే యాష్ ట్యాగ్ తో ఓ పోస్టర్ పంచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ ముఖం కనిపించలేదు. కానీ మెడలో రక్తంతో ఉన్న పెండెంట్ లోశివుని త్రిశూలం, నంది ఉన్నాయి. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా నటిస్తోంది.
మొత్తంమీద, నమ్రత శిరోద్కర్ కుటుంబంతో కలిసి పండుగను జరుపుకున్న విధానం అందరినీ ఆకట్టుకుంది. మహేష్ బాబు త్వరలోనే కుటుంబంతో చేరతారని అభిమానులు ఆశిస్తున్నారు.


