|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నందమూరి హీరోలకు సీక్వెల్ శాపం: బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు తప్పని పరాజయాలు?

Published: 20-12-2025, 3:04 AM
నందమూరి హీరోలకు సీక్వెల్ శాపం: బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు తప్పని పరాజయాలు?
  • బాలకృష్ణ అఖండ 2 చిత్రం భారీ పరాజయం పాలైంది.
  • ఎన్టీఆర్ వార్ 2 డిజాస్టర్ కాగా, దేవర 2 పరిస్థితి అయోమయం.
  • కళ్యాణ్ రామ్ డెవిల్ 2 ఆగిపోయింది; బింబిసార 2కు ప్రకటన లేదు.
  • మొత్తంగా నందమూరి హీరోలకు సీక్వెల్ చిత్రాలు కలిసి రావడం లేదు.

ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తున్నా, నందమూరి హీరోలకు మాత్రం ఈ ట్రెండ్ కలిసి రావడం లేదు. బాలకృష్ణ అఖండ 2 పరాజయం, ఎన్టీఆర్ వార్ 2 నిరాశ, కళ్యాణ్ రామ్ సీక్వెల్ చిత్రాల ఆలస్యం అభిమానుల్లో ఆందోళన నింపుతోంది. అసలు వారి సీక్వెల్ చిత్రాలకు ఏమైంది?

సీక్వెల్ ట్రెండ్: నందమూరి హీరోలకు ప్రతికూలం

ప్రస్తుతం ఇండియన్ సినిమా మొత్తం సీక్వెల్స్ హవా సాగుతోంది. వీటిలో ముందుగా రెండు భాగాలుగా ప్రకటించిన సినిమాలు కొన్ని అయితే ఒక సినిమా హిట్ అయ్యాక దానికి సీక్వెల్ ప్రకటించినవి మరికొన్ని. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే సీక్వెల్ చిత్రాలు నందమూరి హీరోలకు ఏమాత్రం కలసి రావడం లేదు. బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం పూర్తిగా నిరాశ పరచడంతో అభిమానుల్లో ఈ చర్చ మొదలైంది.

కోవిడ్ తర్వాత 2021లో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం అఖండ విడుదలైంది. ఆ చిత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా సంచలనం సృష్టించింది. బాలయ్య పోషించిన అఘోర పాత్ర అఖండ బాగా క్లిక్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలి అని బోయపాటి డిసైడ్ అయ్యారు. ఈ చిత్రానికి సీక్వల్ గా వచ్చిన అఖండ 2 తాండవం ఇటీవల విడుదలైంది.

బాలకృష్ణ, ఎన్టీఆర్ సీక్వెల్స్: నిరాశే మిగిలిందా?

కానీ ఈ చిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. మరోవైపు వార్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన వార్ 2 ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రంతో పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. తారక్ కి ఈ సీక్వెల్, బాలీవుడ్ ఎంట్రీ ఏమాత్రం కలసి రాలేదు. మరోవైపు దేవర 2 పరిస్థితి ఏంటి అనేది కొరటాల శివకి అయినా తెలుసా అంటే అనుమానమే. ఎన్టీఆర్ కాని, కొరటాల కాని దేవర 2 ఊసే ఎత్తడం లేదు.

దేవర చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయింది కానీ.. కంటెంట్ పై అంత మంచి రివ్యూలు రాలేదు. అందుకే ఈ సీక్వెల్ పై ఎవరూ ఆసక్తిగా లేరు. మరోవైపు కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా అంతే. కళ్యాణ్ రామ్ ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ కథాంశంతో నటించిన డెవిల్ చిత్రం మంచి ప్రయత్నమే. కానీ కమర్షియల్ గా అది డిజాస్టర్. ఆ చిత్రానికి కూడా కళ్యాణ్ రామ్ సీక్వెల్ చేయాలి అనుకున్నారు.

కళ్యాణ్ రామ్ సీక్వెల్ చిత్రాల కథేంటి?

డెవిల్ నిరాశ పరచడంతో డెవిల్ 2 అటకెక్కింది. మరోవైపు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ బింబిసార చిత్రం. ఆ చిత్రానికి క్లైమాక్స్ లోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు. డైరెక్టర్ కూడా మారిపోయారు. కానీ ఇంతవరకు బింబిసార 2కి సంబంధించిన ప్రకటన లేదు. ఇదంతా చూస్తుంటే నందమూరి హీరోలకు సీక్వెల్ చిత్రాలు కలిసి వస్తున్నట్లు అనిపించడం లేదు.

అఖండ 2, వార్ 2 నిరాశలు, ఇతర సీక్వెల్స్ ఆలస్యాలను బట్టి చూస్తే నందమూరి హీరోలకు సీక్వెల్ చిత్రాలు కలిసి రావడం లేదని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ హీరోలు సీక్వెల్స్ విషయంలో పునరాలోచిస్తారేమో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.