|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్! నందమూరి వారసుడు ఏ సినిమాతో వస్తున్నాడో తెలుసా?

Published: 11-01-2026, 6:00 AM
మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్! నందమూరి వారసుడు ఏ సినిమాతో వస్తున్నాడో తెలుసా?
  • నందమూరి మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
  • ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమాతో మోక్షజ్ఞ పరిచయం కానున్నారు.
  • క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, 2026 జనవరిలో సినిమా ప్రారంభం కానుంది.
  • ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు.

నందమూరి మోక్షజ్ఞ త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. ఆయన ఆదిత్య 369 సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనుండగా, 2026 జనవరిలో ప్రారంభం కానుంది.

మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం

Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణం.. ఇక దగ్గర్లోనే ఉందని తెలుస్తోంది. నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయనే సమాచారం హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి కుటుంబ వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి సినిమా ద్వారా పరిచయం అవుతాడన్న ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. తాజా రిపోర్టుల ప్రకారం.. ఆయన మొదటి సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది.

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా ఒక సాధారణ కథ కాదంట. తెలుగులో క్లాసిక్ మూవీగా గుర్తింపు పొందిన ఆదిత్య 369కు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుందని ఎన్నో రోజుల నుంచి ప్రచారం అవుతున్న వార్త ఇప్పుడు నిజం కాదంట. ఈ కొత్త సినిమాకు ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎప్పుడో బాలయ్య చెప్పి ఉండగా.. మధ్యలో మళ్లీ ఈ హీరో ప్రశాంత్ వర్మతో ఒక సినిమా ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమా మళ్లీ ఆగిపోయింది. ఇక ఇప్పుడు బాలయ్య ఆదిత్య 999 చిత్రమే తన కొడుకు మొదటి సినిమాగా ఫిక్స్ అయ్యారు అంట. ఆదిత్య 369 సినిమాకు ఉన్న పేరు, ఇమేజ్, క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మోక్షజ్ఞను చాలా స్ట్రాంగ్‌గా ఇంట్రడ్యూస్ చేయాలనే ప్లాన్‌లో.. మేకర్స్ ఉన్నారఝట. పాత సినిమాతో లింక్ ఉండేలా, కానీ నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా కథను డిజైన్ చేశారని తెలుస్తోంది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది క్రిష్ అని కూడా సమాచారం. చరిత్రాత్మక కథలు, కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడంలో క్రిష్‌కు మంచి పేరు ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. కథ, కథనం, పాత్రల రూపకల్పన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. మోక్షజ్ఞ తొలి సినిమా కావడంతో ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు.

ఆదిత్య 999 మ్యాక్స్: సీక్వెల్‌తో పరిచయం

ఈ సినిమాను జనవరి 2026 చివర్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఆ తర్వాత మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎంపికపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారట. బలమైన క్యాస్టింగ్ ఉంటుందని, కీలక పాత్రల కోసం పేరున్న నటులతో మాట్లాడుతున్నారని సమాచారం. మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని టాక్. అంతేకాదు, ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్ చాలా స్టైలిష్‌గా, కొత్తగా ఉండబోతుందట.

ఇంతకుముందు మోక్షజ్ఞ ఎంట్రీపై ఆయన తండ్రి బాలకృష్ణ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు బాగా తెలుసు. అతని కోసం ఐదు, ఆరు కథలు నా మైండ్‌లో రెడీగా ఉన్నాయి” అని బాలయ్య చెప్పడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు అవే మాటలు నిజమవుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దర్శకుడు క్రిష్, ప్రారంభం ఎప్పుడంటే?

ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. ఆయన డైలాగ్స్‌కు ఉన్న పవర్ సినిమాకు మరో ప్లస్‌గా మారనుంది.

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ చిత్రం ఒక భారీ విజయాన్ని అందుకుంటుందని ఆశిద్దాం. మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.