
📌 Key Points
- నందు ‘సాయి సిద్ధార్థ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
- తప్పుడు వార్తల కారణంగా దేశం విడిచి వెళ్లాలనిపించిందని నందు భావోద్వేగం.
- భార్య గీతా మాధురి కూడా దేశం వదిలి పారిపోవాలని సూచించారు.
- నేపథ్యం లేనివారిపై అసత్య ఆరోపణలు వస్తాయని నందు ఆవేదన వ్యక్తం చేశారు.
టాలీవుడ్ నటుడు నందు తన తాజా సినిమా ‘సాయి సిద్ధార్థ’ ప్రమోషన్స్‌లో భాగంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలనుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటనలు ఆయన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపాయో తెలుసుకోండి.
నందు కొత్త సినిమా ‘సాయి సిద్ధార్థ’ వివరాలు
టాలీవుడ్ నటుడు నందు(Nandu) ‘సైక్ సిద్ధార్థ’ (Sai Siddharth)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కామెడీ, రొమాన్స్, సోషల్ సాటిర్ అంశాలతో కూడిన డార్క్ కామెడీ డ్రామాగా రాబోతుండగా..యామిని భాస్కర్ (Yamini Bhaskar)హీరోయిన్‌గా నటిస్తోంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కాబోతుంది. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నందు తన పర్సనల్ విషయాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఇతర దేశానికి పారిపోవాలనుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నా అలాంటి పుకార్లు వచ్చేవి కాదు.
మనకు బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే మనం ఏం చేయలేమని సంబంధం లేని అంశాల్లో మన పేర్తు చేరుస్తారు. నేను చేయని పనికి నా మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో చాలామంది నానారకాలుగా మాట్లాడుకున్నారు. నిజాలు తెలుసుకోకుండా.. జరిగిందేంటి అనేది ఆలోచించకుండా నా గురించి తప్పుగా అనుకున్నారు. ఆ సమయంలో నాతో పాటు నా కుటుంబం చాలా బాధపడింది. అప్పుడు నా భార్య గీతా మాధురి ఇక్కడ ఉండలేకపోతున్నాం. అన్ని వదిలేసి వేరే దేశానికి వెళ్లి హోటల్లో పని చేసుకుందామని చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి’’ అని చెప్పుకొచ్చాడు.
తప్పుడు వార్తలు: నందు అనుభవించిన వేదన
దేశం విడిచి వెళ్లాలనుకున్న నందు, గీతా మాధురి
నందు పంచుకున్న ఈ భావోద్వేగ విషయాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తప్పుడు ప్రచారంతో సినీ ప్రముఖులు ఎలాంటి మానసిక వేదనను అనుభవిస్తారో ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


