|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

న్యాయానికే కాదు.. ఆయువుకూ కులముంది!

Published: 02-07-2025, 9:48 PM
న్యాయానికే కాదు.. ఆయువుకూ కులముంది!

’23’ సినిమా న్యాయ వ్యవస్థలోని కుల వివక్షను ప్రధానంగా చూపిస్తుంది. ఇద్దరు స్నేహితుల దోపిడీ ఘటనతో మొదలయ్యే ఈ సినిమా, న్యాయం అందరికీ సమానంగా ఉందా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. సమాజంలోని అనేక అంశాలను ప్రతిబింబించే కథాంశం ఇందులో ఉంది.

Key Points

1

23 సినిమాలో న్యాయ వ్యవస్థలోని కుల వివక్షను ప్రధానంగా చూపించారు.

2

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరు స్నేహితులు చేసిన దోపిడీ ఘటన చిత్ర కథాంశం.

4

ప్రయోగాత్మకమైన, ప్రయోజనాత్మకమైన సినిమా అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

కుల న్యాయం: ఒక సినిమా సమీక్ష

‘న్యాయానికి కులముందా?’ అనే సందేహాన్నే ప్రధానాంశంగా చేసుకొని తీసిన సినిమా కాబట్టి ఆ ‘కుల న్యాయం’ వల్ల తాము పోగొట్టుకునేదేంటో తెలుసుకొనేందుకైనా 23 సినిమాను దళితులు, బడుగు వర్గాలు ఆదరించవలసిందే! న్యాయం ఒక్కదానికే కాదు, భారతీయ కుల సమాజంలో ఆయువుకు, వాయువుకు కూడా కులముంది. కుల వివక్షా ఉంది. అని నగ్న వాస్తవికతతో చూపిన చిత్రం ఇరవై మూడు.

మొదటి నుండి ఈ సినిమా చూడాలన్న ఉత్సుకత. అది దళితాంశం మీద తీయబడినందుకు కచ్చితంగా కాదు, గానీ ప్రధానాంశంగా తీసుకొన్న, సమాజంలోని పలు వర్గాలకు పలు రకాలుగా దక్కుతున్న న్యాయం అనే సున్నిత, ఒకింత వివాదాస్పద అంశాన్ని దర్శకుడు ఎంత నేర్పుగా డీల్ చేయగలిగాడోననే విషయాన్ని చూడాలన్న ఉత్సుకత వల్ల చూడాల్సి వచ్చింది. అందుకే ఆ సినిమా కోసం అంత పట్టుపట్టి వెళ్లింది. చివరికి ఒక మంచి సినిమా చూసామన్న ‘భారమైన అనుభవ’మైతే దక్కింది!

డబ్బు, కులం, అధికారం ఇవేవీ లేని వారికి న్యాయం దొరకదా? అనే ప్రశ్నను సంధిస్తూ వచ్చిన 23 సినిమా కాస్త కల్పన జోడైన నిజ జీవిత గాథ. ఇద్దరు ప్రేమికుల జీవితంలో జరిగిన దుస్సంఘటన ఎంతటి విపత్కర పరిణామాలకు దారి తీసిందో ఈ సినిమా చెబుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సాగర్, దాస్ అనే స్నేహితులు బస్సు దోపిడి చేయాలనుకుంటారు.. బస్సులో వారిని బెదిరించే ప్రయత్నంలో పెట్రోల్ పోస్తాడు సాగర్.. అనూహ్యంగా అది అంటుకుని 23 మంది ప్రయాణికులు సజీవ దహనమైపోతారు.. వారిద్దరికీ ఉరిశిక్ష పడుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఒక మహానగరంలో జరిగిన మరో బాంబు పేలుడులో 28 మంది చనిపోతారు. పేలుడుకు కారణమైన నిందితులకు కోర్టు నుండి ఏం తీర్పు వచ్చింది. వారికి కూడా ఉరిశిక్ష విధించిందా? అనేది చిత్ర కథ.

సాధారణ ‘సినీ తాత్వికత’ను పక్కనపెట్టి, ప్రస్తుత సినిమా విషయానికొస్తే..ఇలాంటి మంచి ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక సినిమాకు ప్రేక్షకాదరణ లభించకపోవటం ఒకింత బాధించే అంశమే! ఇది వింత, వినోదాత్మక చిత్రం కాకున్నా విద్యావంత, విజ్ఞానాయుత సినిమా అనుటలో ఎట్టి సందేహం లేదు..

23 సినిమా కథాంశం: దోపిడీ నుండి న్యాయం వరకు

ఈ సినిమాను నేను ఏదో కుల భావనతో ఆదరించాలని సిఫారసు చేయడం లేదు. ఈ పర్టిక్యులర్ సినిమా గూర్చి చాలా సింపుల్‌గా చెప్పాలంటే సినిమా ఆద్యంతం అత్యద్భుతంగా ఉంది. తొలి పది నిమిషాల కథనంలో కొంత మందగమనం ఉన్న మాట వాస్తవమే! కానీ.. నెమ్మది నెమ్మదిగా ఈ గమనం వేగమందుకొని, ఆ వేగ గమనంలో కథ చిక్క బడి, పాకానికొచ్చి, కథ క్లైమాక్స్‌కు వచ్చేవరకూ ప్రేక్షకుల్ని తెరకు అలా అతుక్కుపోయేలా చేసింది. ఇంతకు మించి ఓ నాణ్యమైన సినిమాకు ఇంకేం కావాలి? వాస్తవాలను వదిలి మిథ్యా లోక స్వేచ్ఛా విహారమెంతకాలం చేస్తూ ఉంటాం?

ఎంత ‘స్టార్ డం’ ఉన్న హీరో నటించిన సినిమా అయినా కానీయ్.. దళిత ప్రేక్షకులు ఆదరించనిదే, ఏ సినిమా కూడా సక్సెస్ కాదు.. కారణం ప్రేక్షకుల్లో 20 శాతం పైగా అంటే సింహభాగం దళితులే ఉంటారు! దానిలో సగభాగం దళితులు ఈ సినిమా చూసేందుకు హాల్‌కు వచ్చినా, 23 సినిమా ఆర్థికపరమైన నష్టాలను చవిచూసి ఉండేది కాదు. ఇప్పటికైనా పనికిమాలిన మిథ్యా చిత్రాల మాయలో నుండి బయటపడండి. ఇలాంటి ప్రయోజనాత్మక సినిమాలు వచ్చినప్పుడు ముసుగు తన్ని ఇంట్లోనే కూర్చునే బదులు.. మిమ్మల్ని మీరు విద్యావంతులవటంతో పాటు అలాంటి సినిమాలను ఆదరించేందుకైనా కాదు కాదు.. ప్రోత్సహించేందుకైనా బయటకు రండి. ప్రేక్షకులుగా మీరిచ్చే ప్రోత్సాహమే ఇలాంటి మరికొన్ని మంచి సినిమాలు రావటానికి మార్గం అవుతుంది. థియేటర్‌లో మే నెల చివరలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్, ఈ టీవీ విన్ వంటి ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. దర్శకుడు రాజ్ నిజాయితీతో నమ్మి తీసిన 23 మూవీని అందరూ మిస్ కాకుండా చూడండి. 23 సినిమా దర్శక నిర్మాతలతో పాటు, నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలతో..

సినిమా : 23 (ఇరవై మూడు)

సమాజంలోని కుల వివక్షను ప్రతిబింబించే చిత్రం

నటీనటులు : తేజ, తన్మయి

దర్శకత్వం : రాజ్ రాచకొండ

లభ్యం : అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్

చివరగా, ’23’ సినిమా సమాజంలోని కుల వివక్ష, న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను ప్రతిబింబించే ప్రయోగాత్మకమైన చిత్రం. ప్రేక్షకులందరూ చూడవలసిన చిత్రం ఇది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.