|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని హుక్ స్టెప్‌పై వివాదం! కాపీ ఆరోపణలు చేసిన యూట్యూబర్ ఎవరో తెలుసా?

Published: 25-02-2026, 6:05 AM
నాని హుక్ స్టెప్‌పై వివాదం! కాపీ ఆరోపణలు చేసిన యూట్యూబర్ ఎవరో తెలుసా?
  • నాని ‘ఆయా షేర్’ పాటలోని హుక్ స్టెప్ తనదేనని యూట్యూబర్ బాబా జాక్సన్ ఆరోపించారు.
  • బాబా జాక్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అసలు హుక్ స్టెప్ వీడియోను పోస్ట్ చేశారు.
  • ‘ది ప్యారడైజ్’ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది, ఇందులో మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు.
  • రామ్ చరణ్ ‘చికిరి చికిరి’ పాట హుక్ స్టెప్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

నాని ‘ఆయా షేర్’ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే వివాదానికి దారితీసింది. యూట్యూబర్ బాబా జాక్సన్ ఈ హుక్ స్టెప్ తనదని ఆరోపించడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

హుక్ స్టెప్ వివాదానికి కారణం ఏమిటి?

Aaya Sher Hook Step: ఈ మధ్యకాలంలో హుక్ స్టెప్స్ కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో “చికిరి చికిరి” పాటలో రామ్ చరణ్ హుక్ స్టెప్ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఈ చికిరి చికిరి సాంగ్ రికార్డు సొంతం చేసుకోవడమే కాకుండా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది ఈ హుక్ స్టెప్ ను ఇంస్టాగ్రామ్ లో రీల్ గా చేసి ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ సినిమా నుండి నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా “ఆయా షేర్” అంటూ ఒక పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.మ్యూజిక్, బీట్ , లిరిక్స్ ముఖ్యంగా నాని హుక్ స్టెప్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని, అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఒక యూట్యూబర్ నాని వేసిన ఆ హుక్ స్టెప్ నాదే అని, కాపీ కొట్టేసారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ హుక్ స్టెప్పు నాదే అంటున్న ఆ యూట్యూబర్ ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

బాబా జాక్సన్ ఆరోపణలు ఏంటి?

విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో బాబా జాక్సన్ పేరుతో ఒక ఇన్ఫ్లుయెన్సర్.. యూట్యూబ్లో డాన్స్ వీడియోలతో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. గతంలో ఒక విదేశీయుడుతో కలిసి ఇతడు వేసిన స్టెప్ ని ఇప్పుడు నాని “ఆయా షేర్” పాటలో కాపీ కొట్టేసారని బాబా జాక్సన్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు తన ఇన్స్టా లో ఒరిజినల్ హుక్ స్టెప్ ఇదే అంటూ రెండు వీడియోలని కూడా పోస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై చిత్ర బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. మొత్తానికి నాని హుక్ స్టెప్ కాస్త వివాదంగా మారిందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

‘ది ప్యారడైజ్’ సినిమా వివరాలు

ఇక ది ప్యారడైజ్ సినిమా విషయానికొస్తే.. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చ్ 26న థియేటర్లోకి తీసుకురావాలనుకున్నారు . కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కి పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే నాని సరసన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఈ ఆయా షేర్ పాట విడుదల చేసిన కొన్ని గంటల్లోనే భారీ పాపులారిటీ అందుకున్నా.. ఇప్పుడు ఈ సాంగ్ పై వివాదం నెలకొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

మొత్తానికి నాని హుక్ స్టెప్ వివాదానికి దారితీసింది. ఈ ఆరోపణలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.