|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవర తర్వాత సైలెంట్.. సడెన్‌గా పిఠాపురంలో మెరిసిన కొరటాల శివ! ఏం జరిగింది?

Published: 31-03-2026, 2:05 PM
దేవర తర్వాత సైలెంట్.. సడెన్‌గా పిఠాపురంలో మెరిసిన కొరటాల శివ! ఏం జరిగింది?
  • కొరటాల శివ చాలా రోజుల తర్వాత పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా ముందుకు వచ్చారు.
  • దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ చిత్రానికి కొరటాల మద్దతు తెలిపారు.
  • కొరటాల శివ గతంలో మహేష్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేయసి రావే’ చిత్రానికి రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
  • యువత ప్రేమ సమస్యలు, కుటుంబ సంబంధాలపై ‘పిఠాపురంలో’ చిత్రం ఉంటుందని కొరటాల అన్నారు.

‘దేవర’ సినిమా తర్వాత చాలా అరుదుగా కనిపిస్తున్న కొరటాల శివ, పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో సందడి చేశారు. దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ చిత్రానికి ఆయన తన మద్దతును తెలియజేశారు.

పిఠాపురంలో కొరటాల శివ సందడి

Koratala Siva: ‘దేవర’ (Devara) సినిమా తర్వాత కొరటాల శివ (Koratala Siva) పబ్లిక్‌లో చాలా అరుదుగా కనిపిస్తూ వస్తున్నారు. అంతకు ముందు ఏ సినిమా ఈవెంట్‌లో చూసినా కొరటాల ఎక్కువగా కనిపించేవారు. ‘దేవర’ తర్వాత మాత్రం ఎందుకనో, అంతగా ఆయన ఫోకస్ కాలేదు. ఇక ‘దేవర 2’ సినిమాపై ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఏవో వార్తలు వస్తున్నాయి కానీ, అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. మరి ఇలాంటి సమయంలో కొరటాల శివ కనిపిస్తే.. వార్తలు ఆగకుండా ఉంటాయా? ఇంతకీ కొరటాల ఎక్కడ కనిపించాడు? టైటిల్‌లో ఏదో ‘పిఠాపురం’ అన్నారు కదా.. ఏంటి విషయం? అని అనుకుంటున్నారు కదా. ఆ విషయంలోకే వస్తే.. సీనియర్ దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ (Pithapuramlo.. Ala Modalaindi) చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు కొరటాల శివ సపోర్ట్ అందించారు.

డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన తారాగణంగా, మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) నిర్మిస్తోన్న చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. ఈ చిత్రంలో శ్రీరామ్ తపస్వి రాసిన ‘పట్టుకో బాబా’ అనే పాటను దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించి, టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పారు.

‘పిఠాపురం’ చిత్రానికి కొరటాల మద్దతు

పాట విడుదల అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ.. ‘‘చంద్ర మహేష్ అప్పట్లో తీసిన బ్లాక్ బస్టర్ ‘ప్రేయసి రావే’కి నేను రైటింగ్ అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తర్వాత ఆయన తీసిన మరికొన్ని చిత్రాలకు కూడా నేను పని చేశాను. ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలోని పాటను ఆవిష్కరిస్తున్నందుకు చాలా ఆనంద పడుతున్నాను. ఇవాల్టి యువతరం ప్రేమ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, తల్లితండ్రులతో వాళ్ళకున్న కమ్యూనికేషన్ గ్యాప్‌ని చర్చిస్తూ.. రిలేషన్ షిప్స్, అండర్ స్టాండింగ్స్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. దర్శకుడు చంద్ర మహేష్ ఒక ఫీల్‌ని ఎంత ఇంపాక్ట్‌గా చెబుతారో ‘ప్రేయసి రావే’ టైంలోనే చూశాను. అదే ఫీల్‌తో ఈ ‘పిఠాపురంలో’ సినిమా ఉంటుందని నమ్ముతున్నాను. చంద్ర మహేష్ అండ్ టీమ్ అందరికీ పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

గత అనుభవాలను గుర్తు చేసుకున్న కొరటాల

దర్శకుడు మహేష్ చంద్ర (Mahesh Chandra) మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని ఏరియాల పంపిణీదారులు సినిమా కోసం చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమా ఫస్ట్ కాపీతో సహా సిద్ధమైంది. ఏప్రిల్‌లో మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన వీవీ వినాయక్.. ట్రైలర్ రిలీజ్ చేసిన ‘ప్రేయసి రావే’ టీమ్ శ్రీకాంత్, శివాజీరాజా, పృథ్వీ, ఎంఎం శ్రీలేఖ.. ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేసిన కొరటాల శివ లకు మహేష్ చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

మొత్తానికి కొరటాల శివ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘దేవర’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.