|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sreeleela: మీ అమ్మాయి మాట నిలబెట్టుకుంది.. ఇది డిగ్రీ మాత్రమే కాదు.. శ్రీ లీల ఎమోషనల్

Published: 13-02-2026, 12:05 PM
Sreeleela: మీ అమ్మాయి మాట నిలబెట్టుకుంది.. ఇది డిగ్రీ మాత్రమే కాదు.. శ్రీ లీల ఎమోషనల్
  • శ్రీలీల ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి డాక్టర్‌గా పట్టా పొందారు.
  • సినిమా అవకాశాలతో బిజీగా ఉంటూనే చదువును కొనసాగించారు.
  • తన తల్లి స్వర్ణలత కూడా డాక్టర్ కావడంతో వైద్య వృత్తిలోకి అడుగు.
  • పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల.

ప్రముఖ సినీ నటి శ్రీలీల డాక్టర్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేశారు. సినిమా కెరీర్‌తో బిజీగా ఉంటూనే వైద్య విద్యను అభ్యసించడం విశేషం. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

డాక్టర్‌గా శ్రీలీల.. ఎమోషనల్ పోస్ట్!

Sreeleela: శ్రీ లీల సినీ నటిగా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా ఈమె బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఒక వైపు సినిమాల పరంగా బిజీగా ఉంటూనే మరోవైపు ఈమె తన ఎంబిబిఎస్ చదువును కూడా పూర్తి చేశారు. ఇటీవల శ్రీ లీలా తన ఎంబిబిఎస్ డిగ్రీ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా యాక్టర్ గా డాక్టర్ గా ఈమె స్థిరపడ్డారు. శ్రీ లీల డాక్టర్ పట్టా అందుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ పట్టా అందుకుంటున్నటువంటి ఫోటోలతో పాటు తన తల్లి అలాగే తన గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి దిగిన ఫోటోలను ఈమె షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన శ్రీ లీల.. ఇదొక మైలురాయి అని తెలిపారు. ఒక ప్రయాణంలో తెలిసి లేదా తెలియకుండా మీరు భాగమైన ప్రయాణం. ఇదొక పవిత్రమైన స్థలం నేనుగా ఉండగలిగే ప్రదేశం.. నేడు మీ అమ్మాయి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇది కేవలం డిగ్రీ గురించి కాదు ఇది నా ఎదుగుదల ,నమ్మకం ,నా కన్నీళ్లుగా మారడం గురించి అంటూ ఈమె తన ఎంబిబిఎస్ డిగ్రీ అందుకున్న నేపథ్యంలో ఎమోషనల్ అవుతూ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమాలతో పాటు చదువులోనూ రాణింపు

ఇక శ్రీ లీల అమ్మ స్వర్ణలత కూడా డాక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె డాక్టర్ కావడంతో తన కూతురిని కూడా వైద్య వృత్తిలోకి తీసుకువెళ్లారు అయితే సినిమాలపై ఎంతో మక్కువ ఉన్న శ్రీ లీల ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేశారు ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎంబిబిఎస్ కూడా పూర్తి చేశారు. ఇక ఎంబిబిఎస్ పూర్తి కావడంతో శ్రీ లీల తదుపరి తన చదువులను కొనసాగిస్తారా లేదంటే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడి నటిగా కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీలీల భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

ఇక శ్రీ లీల కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలలో నటిస్తున్నారు అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల పరాశక్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తిరిగి ధనుష్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీ లీలతో పాటు సాయి పల్లవి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీలీల తన చదువును కొనసాగిస్తారా లేదా సినీ రంగంలోనే స్థిరపడతారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.