|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nani: నాని నిర్మాణంలో కోర్టు డైరెక్టర్ మరోమూవీ.. లీడ్ రోల్‌లో ఆ స్టార్ హీరో

Published: 14-05-2025, 7:10 PM
Nani: నాని నిర్మాణంలో కోర్టు డైరెక్టర్ మరోమూవీ.. లీడ్ రోల్‌లో ఆ స్టార్ హీరో

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో విడుదలైన ‘కోర్టు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా దర్శకుడు రామ్ జగదీష్ తన తదుపరి చిత్రాన్ని నాని సమర్పణలో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

Key Points

1

నాని నిర్మాణంలో వచ్చిన 'కోర్టు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్.

2

రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన 'కోర్టు' సినిమాతో ఆయన దశ మారింది.

4

దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించే అవకాశం ఉంది.

‘కోర్టు’ సినిమా విజయం

నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కోర్టు’. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రాన్ని నేచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన ఈ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ నటుడు శివాజీ, సాయికుమార్, హర్ష వర్ధన్, రోహిణి, సుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. భారీ అంచనాల మధ్య మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

రామ్ జగదీష్ తదుపరి చిత్రం

ఇక ఈ సినిమాతో డైరెక్టర్ రామ్ జగదీష్ దశ కూడా మారినట్లు అయింది. దీంతో ఇప్పుడు ఈయన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్టు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి నాని సమర్పణలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌(Dulquer Salmaan)ను హీరోగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ చెప్పగా దుల్కర్ కూడా ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రమ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో?

Buzz: #Court movie director Ram Jagadeesh is working on a powerful script for his second film, which will also be produced by #Nani . #DulquerSalmaan is currently being considered for the lead role! pic.twitter.com/0r709MT6E3

కోర్టు సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న రామ్ జగదీష్, తన తదుపరి చిత్రాన్ని నాని సమర్పణలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే అవకాశం ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.