
నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ మే 1న విడుదలవుతోంది. ఈ సినిమా నిర్మాత కూడా నానియే. సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాని.
Key Points
నాని 'హిట్ 3' సినిమా నిర్మాత కూడా.
సినిమా బడ్జెట్ గురించి నానికి తెలియదని ఆయన వెల్లడించారు.
మే 1న 'హిట్ 3' థియేటర్లలో విడుదలవుతోంది.
నాని తదుపరి చిత్రాలు 'ప్యారడైజ్' మరియు సుజీత్ చిత్రం.
‘హిట్ 3’ విడుదల తేదీ
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు అంటూ నానితో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెగ తిరిగేశారు. వరస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ చాలా కష‍్టపడ్డారు. ఫలితం ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.
హిట్ 3 సినిమాలో హీరోగా చేసిన నానినే.. నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడికి చెందిన వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బడ్జెట్ గురించి రకరకాల నంబర్స్ వినిపించాయి. రూ.60 కోట్లు అని రూ.80 కోట్లు అని కూడా అన్నారు. దీని గురించే ఓ ఇంటర్వ్యూలో నానిని అడగ్గా.. ఈ మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టాననేది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
సినిమా బడ్జెట్ రహస్యం
నిర్మాణ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ టీమ్ ఉందని, వాళ్లు అడిగిన దానికోసం ఖర్చు పెట్టడం తప్పితే బడ్జెట్ గురించి తనకు అస్సలు తెలియదని నాని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో వచ్చిన గత రెండు చిత్రాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. ఈసారి విపరీతమైన యాక్షన్ జోడించారు.
తెలుగులో హిట్ 3 తప్పితే వేరే సినిమాలేం రిలీజ్ కావట్లేదు. మరోవైపు తమిళంలో సూర్య ‘రెట్రో’, హిందీలో అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’ చిత్రాలు మే 1న థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనేది చూడాలి?
నాని తదుపరి ప్రాజెక్టులు
హిట్ 3 విడుదలకు సిద్ధం చేసిన నాని.. త్వరలో ‘ప్యారడైజ్’ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇది అయిన తర్వాత సుజీత్ తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.
మొత్తానికి, ‘హిట్ 3’ సినిమా విడుదలకు నాని సన్నద్ధమవుతున్నారు. బడ్జెట్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచాయి. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా ఆయన మాట్లాడారు.


