|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ మూవీలో నాని: శ్రీకాంత్ ఓదెల సంచలన ప్లాన్! ఇది మామూలు ట్విస్ట్ కాదు!

Published: 20-01-2026, 1:30 AM
మెగాస్టార్ మూవీలో నాని: శ్రీకాంత్ ఓదెల సంచలన ప్లాన్! ఇది మామూలు ట్విస్ట్ కాదు!
  • దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి సినిమా?
  • నాని నిర్మాణంలో చిరంజీవి సినిమా రానుందా?
  • గెస్ట్ రోల్ లో నాని కనిపించే అవకాశం?
  • 1970 నాటి నేర సామ్రాజ్యం కథతో సినిమా

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో భాగం కానున్నారా? దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రాబోయే సినిమాలో నాని గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి సినిమాలో నాని?

Hero Nani : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య నాని నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ అవుతున్నాయి. వరుసగా హిట్ సినిమాలు పడడంతో నానితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. ఇటీవల నాని హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ థియేటర్లలోకి రాకముందే డైరెక్టర్ మరో స్టార్ హీరోతో సినిమా చెయ్యనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మూవీలో నాని కూడా నటిస్తున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందులో నిజమేంత ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా తన మెగా హవాను ఏమాత్రం తగ్గించడం లేదు.. రీసెంట్గా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి మరో సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో చిరు ఓ సినిమా చేయవునున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ సినిమాలో స్టార్ హీరో నాని సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించనున్నారు. నాని నిర్మాణంలో మెగాస్టార్ సినిమా అంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించడం మాత్రమే కాదు.. అందులో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ కాంబో గనక నిజమైతే మరో బ్లాక్ బస్టర్ పక్కా అని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే దీని గురించి ప్రకటన రాబోతుందని సమాచారం..

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ చిత్రం

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమా స్టోరీ 1970 నాటి స్టోరీ అని టాక్. డెబ్బైల నాటి పరిస్థితులు, ఆ కాలపు నేర సామ్రాజ్యం, ఒక పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో శ్రీకాంత్ ఓదెల ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది.. ఈ స్టోరీ గురించి రోజుకో వార్త బయటకు రావడంతో చిరంజీవి మళ్ళీ వింటేజ్ లుక్ లో కనిపిస్తాడని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది..

ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్న వార్తలు

హీరో నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో వచ్చిన దసరా మూవీ.. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ కాంబోలో ది ప్యారడైజ్ సినిమా రాబోతుంది అన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉండబోతుందని ఇప్పటివరకు బయటకొచ్చిన అప్డేట్స్ ని చూస్తే తెలుస్తుంది. కాకుల కథతో రాబోతున్న ఈ మూవీ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..

చిరంజీవి, నాని కాంబినేషన్లో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా 1970ల నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.