
జయమ్ము నిశ్చయమ్మురా షోలో నాని తన 17 ఏళ్ల పాత టీ-షర్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అష్టాచెమ్మా సినిమా ఆడిషన్స్ నుంచి అతని జీవితంలోని ప్రత్యేకమైన సంఘటనలకు ఈ షర్ట్ ఎలా సంబంధించిందో తెలుసుకుందాం.
Key Points
నాని 17 ఏళ్ల క్రితం ధరించిన టీ-షర్ట్ ఇప్పటికీ దాచుకున్నాడు.
ఆ టీ-షర్ట్‌తో నాని తొలి ఫోటో షూట్ జరిగింది.
అంజును మొదటిసారి కలిసినప్పుడు కూడా అదే షర్ట్ ధరించాడు.
ఈ షర్ట్ నానికి చాలా ప్రత్యేకమైనది, అందుకే దాచుకున్నాడు.
నాని పాత షర్ట్ రహస్యం
Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల హిట్ 3 సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టాడు. త్వరలో ది ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నాడు.(Nani)
తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే షోలో గెస్ట్ గా వచ్చారు. ఈ షో లో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో జగపతి బాబు నాని పాత షర్ట్ ని ఒకటి తీసి చూపించారు. ఆ షర్ట్ తో ఉన్న ఫొటోని చూపించారు. దీంతో నాని ఆశ్చర్యపోయి ఆ షర్ట్ వెనక ఉన్న కథ గురించి చెప్పాడు.
అష్టాచెమ్మా మరియు ఆ టీ-షర్ట్
నాని మాట్లాడుతూ.. నా ఫస్ట్ ఫోటోషూట్ ఆ షర్ట్ మీదే. అష్టాచెమ్మా సినిమాకు ఆడిషన్స్ కోసం ఫొటోలు కావాలి అంటే ఇక్కడే జూబ్లీహిల్స్ లో పార్క్ లో ఆ షర్ట్ మీద అప్పటికప్పుడు మాములుగా ఫొటోలు తీసి పంపించాను. ఆ తర్వాత అంజు(నాని భార్య)ని మొదటిసారి కలవడానికి వెళ్లినప్పుడు కూడా అదే టీ షర్ట్ వేసుకున్నాను. అందుకే అది నాకు చాలా స్పెషల్. అంజు ఆ షర్ట్ ని దాచింది. తనే మీకు ఇచ్చిందేమో అని అన్నాడు. అలా నానికి ఆ టీ షర్ట్ చాలా స్పెషల్ అని, అందుకే 17 ఏళ్ళు అయినా అలాగే దాచినట్టు తెలిపాడు.
అంజుతో తొలి సమావేశం
చివరిగా, నాని తన ప్రత్యేకమైన టీ-షర్ట్‌ను 17 ఏళ్లపాటు దాచుకోవడం వెనుక ఉన్న కారణం చాలా హృద్యంగా ఉంది. ఈ షర్ట్ అతని జీవితంలోని ముఖ్యమైన క్షణాలకు సాక్ష్యంగా నిలిచింది.


