
📌 Key Points
- మంత్రి ధర్మేంద్రను ముప్పుతిప్పలు పెట్టిన రాజ్, హాస్పిటల్‌కు రప్పించిన వైనం!
- తులసికి నిజం చెప్పేలా చేయని రాజ్, ప్లాన్ బెడిసి కొట్టిందా?
- కళ్యాణ్ సంతోషం: అప్పుకు డెలివరీ డేట్ ఫిక్స్, స్వీట్స్ పంచుతూ హడావిడి!
- మంత్రితో రాజ్ డీల్: ఒక్కరోజు గడువు విధించడంతో ఉత్కంఠ!
బ్రహ్మముడి సీరియల్ అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్! రాజ్ తన తెలివితేటలతో మంత్రిని ఎలా ఆటాడుకున్నాడో చూడండి. రుద్రాణి పన్నాగం ఏమిటో తెలుసుకోండి. అస్సలు మిస్ అవ్వకండి!
మంత్రికి రాజ్ షాక్: అసలేం జరిగింది?
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌లో మంత్రి ధర్మేంద్రను రాజ్ ముప్పుతిప్పలు పెట్టి హాస్పిటల్‌కు వచ్చేలా చేస్తాడు రాజ్. కానీ, తులసికి నిజం చెప్పేలా చేయరు. మరోవైపు అప్పుకు డెలివరి డేట్ ఇచ్చారని కల్యాణ్ సంతోషంగా స్వీట్స్ పంచుతారు. మంత్రితో రాజ్ డీల్ కుదుర్చుకుంటాడు. ఇంకా ఒక్కరోజే గడువుందని చెబుతాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ భయపెట్టడంతో మంత్రి ధర్మేంద్ర డాక్టర్ చక్రవర్తిని కిడ్నాప్ చేసి పెట్టిన చోటుకు వెళ్తాడు. ఈ చుట్టు పక్కలకు ఎవడు వచ్చిన చింపేయండి. వీడు ఎవడికి దొరకొద్దు అని రౌడీలకు చెబుతాడు మంత్రి.
మరోవైపు నీలవేణి దగ్గరికి మంత్రి ధర్మేంద్ర వెళ్తాడు. గదిలో ఎవరున్నారని చూస్తాడు. కానీ, ఎవరుండరు. మీరేంటీ ఇక్కడికి వచ్చారని నీలవేణి అడిగితే.. నీ గొంతు పెగలకూడదని పది లక్షలు ఇచ్చాను. రాజ్, కావ్యతో ఎందుకు చేతులు కలిపావు, వాళ్లకు నిజం ఎలా తెలిసింందని బెదిరిస్తాడు మంత్రి ధర్మేంద్ర. నేను వాళ్లతో చేతులు కలపలేదు. కానీ, ఆరోజు కావ్యకు డాక్టర్ అనురాధతో కలిసి కావ్యకు నిజం తెలిసిందని నీలవేణి చెబుతుంది.
నేను నిజం ఒప్పుకున్నా కానీ సాక్ష్యం చెబుతానని చెప్పలేదు. నా పిల్లలను చూసి కావ్య వదిలేసిందని నీలవేణి చెబుతుంది. కానీ, నా భార్యకు నిజం చెబుదామని బెదిరిస్తున్నారని మంత్రి అంటాడు. ప్రాణం పోయిన నేను బయటకొచ్చి సాక్ష్యం చెప్పను అని నీలవేణి అంటుంది. వాడు మాత్రం గేమ్స్ ఆడుతున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు అని మంత్రి అంటాడు.
కళ్యాణ్, రాజ్‌లకు గుండు: కారణం ఇదేనా?
మీరెందుకు టెన్షన్ పడుతున్నారని రాజ్ అంటాడు. డాక్టర్ ఏం చెప్పాడు అని మంత్రి అడిగితే.. ఆయుర్వేద మందు గురించి చెప్పారు. పాలు తక్కువ వస్తున్నాయిగా అని తులసి అంటుంది. చక్రవర్తి అంతేగా అని మంత్రి అంటే.. నిజం ఇంకేముంటుంది సార్ అని చక్రవర్తి అంటాడు. రాజ్, కావ్య సెటైర్లు వేస్తారు. అంత పెద్ద మనిషి తప్పు చేశారేమో అని కావ్య అంటుంది.
డెలివరి అయ్యాకా ఒక్కసారి కూడా చెకప్‌కి రాలేదు ఎందుకు అని తులసి అడుగుతుంది. సీరియస్ కేసు వస్తే వేరే హాస్పిటల్‌కు నేనే పంపించాను అని మంత్రి అంటాడు. తులసి డాక్టర్‌ను కలుస్తానని వెళ్తుంది. నా బిడ్డను దూరం చేసినందుకు నేనంత తల్లడిల్లానో అర్థమైందా అని కావ్య అంటుంది. ఇచ్చిన గడువులో ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ లోపు మా బిడ్డను మా చేతులో పెట్టండి అని కావ్య అంటుంది.
తులసికి తన పాపను ఇచ్చేటప్పుడు ఎలాంటి అన్యాయం జరగకూడదు. తనకు ఎలాంటి వెలితి ఉండకూడదు అని కావ్య అంటుంది. వారం రోజుల పాటు రోజు హాస్పిటల్‌కు తీసుకురావాల్సి ఉంటుంది అని డాక్టర్ చెబుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరిని పిలిచి కల్యాణ్ స్వీట్స్ పంచుతాడు. ఏమైందని అంతా అడుగుతారు. అప్పుకు డెలివరి డేట్ ఇచ్చారని కల్యాణ్ చెబుతాడు.
రుద్రాణి కొత్త స్కెచ్: ధాన్యలక్ష్మితో డేంజర్ ప్లాన్!
అంతా సంతోషిస్తారు. ఇక బాబుకు జన్మనివ్వాలని అంతా అంటారు. రేఖ మాత్రం అసూయతో రగిలిపోతుంది. రాజ్, కావ్య వస్తే వాళ్లకు కూడా కల్యాణ్ చెబుతాడు. పాప ఆరోగ్యం బాగుందన్న విషయం ఇంట్లోవాళ్లకు చెబుతాడు రాజ్. దాంతో రేఖ మరింత రగిలిపోతుంది. రేఖకు రెండు బ్యాడ్ న్యూస్‌లు అన్నట్లుగా ఫీల్ అవుతుంది.
మినిస్టర్ భార్యే బలం అని రాజ్ అంటాడు. కట్ చేస్తే రాజ్, మంత్రి కలుస్తారు. పాపను ఇవ్వలేని, తులసికి నిజం చెప్పలేనని మంత్రి అంటాడు. నా భార్య మాత్రం వేరేవాళ్ల పాపను ఎలా చూసుకోగలదు. మీకుచ్చిన గడువు రేపటి వరకే. మా బిడ్డను మాకివ్వండి. లేకుంటే నిజాలన్నీ బయటపడతాయని రాజ్ చెబుతాడు.
మంత్రితో రాజ్, కావ్య గొడవ పెట్టుకున్నారని, మంత్రి మళ్లీ అప్పును ఏమైనా చేస్తారని ధాన్యలక్ష్మీ భయపడెలా చెబుతుంది రుద్రాణి. రాజ్, కావ్యలను ధాన్యలక్ష్మీతో ఆపేందుకు కొత్త స్కెచ్ వేస్తుంది రుద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా ముగిసింది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందో చూడటానికి వేచి ఉండండి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


