|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘పారడైజ్’లో ధూమావతి దేవి ట్రీట్‌మెంట్! ఈ దేవతకు కాకి వాహనమెందుకు? మామూలు షాక్ కాదు ఇది!

Published: 11-03-2026, 7:05 AM
నాని 'పారడైజ్'లో ధూమావతి దేవి ట్రీట్‌మెంట్! ఈ దేవతకు కాకి వాహనమెందుకు? మామూలు షాక్ కాదు ఇది!
  • నాని ‘పారడైజ్’లో ధూమావతి దేవి పాత్ర.. సంచలనంగా మారిన కాకి వాహనం, వితంతువుల పూజల సీన్స్!
  • 1980ల హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సంచార జాతి కథ.. నాని పాత్ర ఊహించని మలుపులతో!
  • ఆగస్టు 21న ‘పారడైజ్’ విడుదల.. గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన మేకర్స్!
  • కాసర్ల శ్యామ్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు.. సినిమాలో ధూమావతి దేవి పాట కూడా ఉంటుందట!

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘పారడైజ్’ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ధూమావతి దేవి అనే కొత్త అంశాన్ని పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ధూమావతి దేవి: నాని సినిమాలో ఈ దేవత స్పెషాలిటీ ఏంటి?

Dhumavati Devi : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ది పారడైజ్ సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్ తో మరింత హైప్ నెలకొంది. ఈ సినిమాలో కాకి జాతి అంటూ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా లో ఆయా షేర్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ మీడియాతో మాట్లాడారు.

కాసర్ల శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి కూడా పలు ఆసక్తికర వైషయాలు తెలిపారు. ఈ సినిమా.. హైదరాబాద్, సికింద్రాబాద్ లో 1980 ల్లో జరిగే కథ. సవారీ జాతికి చెందిన కథ. ఓ సంచార జాతి లాంటి వాళ్లకు సంబంధించిన కథ. ఆ జాతిలోంచి ఓ హీరో పుడతాడు. ఈ జాతి వాళ్ళు ధూమావతి అనే దేవతని పూజిస్తారు. సినిమాలో ఆమెకు పూజ చేసే సీన్స్ కూడా ఉంటాయి. ఆ పూజ దగ్గర ఓ పాట కూడా ఉండే అవకాశం ఉంది అని తెలిపారు.

1980ల హైదరాబాద్‌లో నాని ‘పారడైజ్’ కథ!

దీంతో ధూమావతి దేవి ఎవరు అని వెతుకులాట మొదలుపెట్టారు. హిందూ పురాణాల ప్రకారం ధూమావతి దేవి పది హిందూ తాంత్రిక దేవతల సమూహం అయిన మహావిద్యలలో ఒకటి. ఎదవా మహావిద్య ఈ ధూమావతి మహాదేవి. ధూమావతి అంటే భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. ఈ దేవత తెల్లచీర కట్టుకొని వితంతువుగా గుర్రం లేని రథంపై కనిపిస్తుంది. ఈమెకు కాకి వాహనంగా ఉంటుంది. ఈమె చుట్టూ కాకులు తిరుగుతుంటాయి. చేతిలో చాట ఆయుధంగా ఉంటుంది.

దహన సంస్కారాలు జరిగే ప్రదేశాల్లో ఈ దేవత ఉంటుంది. ధూమావతి సాధారణంగా అశుభానికి సూచిస్తారు. విశ్వ వినాశన సమయంలో ఈమె కనిపిస్తుందని అంటారు. ఈమె సమాజంలో ఎక్కడికీ వెళ్ళని స్త్రీగా, ఆకర్షణీయం కానిది, అశుభం, పేదలు, బిచ్చగాళ్ళు, కుష్టురోగులు, రోగుల రూపంలో కనిపిస్తుంది. ఎడారులు, శిథిలమైన ఇళ్ళు, పేదరికం, ఆకలి, దాహం, తగాదాలు, పిల్లల శోకం, అడవి, స్మశానాలు.. లాంటి అనాగరిక ప్రమాదకరమైన ప్రదేశాలలో నివసిస్తుంది. కొన్ని చోట్ల ధూమావతిని ఒక మాంత్రికురాలుగా కూడా వర్ణించారు. ఆమె జీవితంలోని అన్ని భయంకరమైన కష్టాలను సూచిస్తుంది. కాకి వాహనం కాబట్టి కాకి లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. శవం మీద కూర్చుంటుందని, బూడిదను ధరిస్తుందని అంటారు.

‘పారడైజ్’లో కాకి జాతి సీన్స్.. కాసర్ల శ్యామ్ మాటల్లో సినిమా విశేషాలు!

అయితే ధూమావతి తాంత్రిక దేవత కావడంతో అతీంద్రియ శక్తులను ఇచ్చేదిగా, అన్ని కష్టాల నుండి రక్షించేదిగా, అంతిమ జ్ఞానం ప్రసాదించేదిగా పురాణాల్లో వర్ణించారు. శత్రువులను ఓడించాలనుకునే వారు ఆమెని ఆరాధిస్తారు. ధూమావతి దేవిని కేవలం జంటగా లేని సభ్యులు, బ్రహ్మచారులు, వితంతువులు, ప్రపంచ పరిత్యాగిలు, తాంత్రికులు మాత్రమే పూజ చేస్తారు. వివాహం చేసుకున్న జంటలు ఈమెను పూజించరు. వారణాసిలో ఈమె ఆలయం ఉంది. దేశంలో చాలా తక్కువ ఆలయాలు ఈ దేవతకు ఉన్నాయి. కానీ కొన్ని స్మశానాల్లో తాంత్రిక ఆచారాల ద్వారా ఆమెను ఆరాధిస్తారని సమాచారం. ఈ ధూమావతి దేవిని పారడైజ్ సినిమాలో నాని, అతని సవారి జాతి పూజించే విధంగా చూపించబోతున్నారని సమాచారం.

గమనిక : ఈ ధూమావతి దేవి యొక్క సమాచారం పలు సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం నుంచి సేకరించబడినది.

నాని ‘పారడైజ్’ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ధూమావతి దేవి పాత్ర సినిమాకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.