|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్! విలన్‌గా సీనియర్ నటుడు.. సంచలనంగా మారుతున్న వార్త!

Published: 24-01-2026, 1:05 AM
నాని 'ది ప్యారడైజ్'లో ఊహించని ట్విస్ట్! విలన్‌గా సీనియర్ నటుడు.. సంచలనంగా మారుతున్న వార్త!
  • నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.
  • ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
  • ‘ది ప్యారడైజ్’ మూవీలో అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
  • ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘ది ప్యారడైజ్’లో విలన్ ఎవరు?

The Paradise : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్ ‘.. దసరా సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీతో 200 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జనాల్లో గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది.. ఇక ఈ మూవీలో స్టార్స్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇందులో మరో స్టార్ నటుడు విలన్ పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఆయన ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటుడే.. ఆ నటుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

హీరో నాని ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. గతంలో రిలీజ్ అయిన సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో పాటుగా 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా తల్లి కొడుకుల సెంటిమెంట్తో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో సీనియర్ నటుడు అయినా తనికెళ్ల భరణి విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ మూవీ పై క్లారిటీ ఇచ్చారు.. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్టులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాను అని అన్నారు. కెరియర్ మొదట్లో చేసిన ఆ పాత్రను ఇప్పుడు మళ్లీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన అన్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నానితో తనికెళ్ల భరణి పోటీ అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

తనికెళ్ల భరణి విలన్ పాత్రపై క్లారిటీ!

సినిమాపై అంచనాలు

ఇటీవల నాని నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తున్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో గతంలో దసరా మూవీ వచ్చింది.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమా పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్యారడైజ్ మూవీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాని ఎస్ఎల్వి సినిమా బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. మరి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

మొత్తానికి నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తనికెళ్ల భరణి విలన్ పాత్రలో నటిస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుందేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.