|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నానితో యానిమల్ బ్యూటీ రొమాన్స్! పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన మేకర్స్.. బ్లాక్ బస్టర్ పక్కా!

Published: 21-02-2026, 10:35 AM
నానితో యానిమల్ బ్యూటీ రొమాన్స్! పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన మేకర్స్.. బ్లాక్ బస్టర్ పక్కా!
  • నాని, సుజీత్ కాంబోలో బ్లడీ రోమియో మూవీ.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ భారీ ప్రాజెక్ట్!
  • పూజా హెగ్డే అవుట్.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీతో నాని రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
  • పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్.. త్రిప్తి డిమ్రీ ఎంట్రీతో సినిమాకు మరింత క్రేజ్!
  • 2027లో బ్లడీ రోమియో విడుదల.. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటున్న ఫ్యాన్స్!

నేచురల్ స్టార్ నాని మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్లడీ రోమియో సినిమాలో హీరోయిన్ విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

నాని, సుజీత్ కాంబోలో బ్లడీ రోమియో

Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వచ్చిన లాస్ట్ సినిమా హిట్ 3. యాక్షన్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ రాగా సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ది ప్యారడైజ్ తరువాత నాని(Nani) ఓజీ దర్శకుడు సుజీత్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

త్రిప్తి డిమ్రీ ఎంట్రీతో మారిన సీన్

ఈ సినిమా నటించబోయే హీరోయిన్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే. నాని సినిమాలో హీరోయిన్ గా ముందు పూజ హెగ్డేను తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్. కానీ, ఈ మధ్య కాలంలో పూజ ఫేమ్ చాలా వరకు తగ్గిపోయింది. అందుకే, ఆమెను పక్కన పెట్టి లేటెస్ట్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

పాన్ ఇండియా మార్కెట్ పై కన్ను

యానిమల్ సినిమాతో త్రిప్తికి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రీసెంట్ గా ఆమె ప్రభాస్ తో స్పిరిట్ సినిమా కూడా చేస్తోంది. దాంతో, ఇప్పుడు ఆమె ఫేమ్ డబుల్ అయ్యింది. ఇక బ్లడీ రోమియో అనేది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి, త్రిప్తిని తీసుకుంటే పాన్ ఇండియా మార్కెట్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.

నాని, త్రిప్తి డిమ్రీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.