|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని వర్సెస్ మోహన్ బాబు.. చేతులకు రక్తంతో.. చొక్కా లేకుండా.. ప్యారడైజ్ నుంచి ఫస్ట్ లుక్.. విలన్ గా కలెక్షన్ కింగ్

Published: 27-09-2025, 9:37 AM
నాని వర్సెస్ మోహన్ బాబు.. చేతులకు రక్తంతో.. చొక్కా లేకుండా.. ప్యారడైజ్ నుంచి ఫస్ట్ లుక్.. విలన్ గా కలెక్షన్ కింగ్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ మూవీ నుండి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. చేతులకు రక్తంతో, చొక్కా లేకుండా ఉన్న ఈ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Key Points

1

నాని 'ది ప్యారడైజ్' సినిమాలో మోహన్ బాబు విలన్‌గా తన క్రూరత్వాన్ని చూపించనున్నారు.

2

మోహన్ బాబు ఫస్ట్ లుక్‌లో చేతులకు రక్తంతో, చుట్ట, కత్తితో పవర్ఫుల్ గా కనిపించారు.

4

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' మార్చి 26, 2026న విడుదల కానుంది.

మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ లుక్

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన క్యారెక్టర్లు ప్లే చేశారు మోహన్ బాబు. విలనిజం పండించారు. హీరోగా మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అదరగొట్టారు. కానీ రీసెంట్ టైమ్ లో ఆయనకు తగ్గ పాత్ర, సినిమా దక్కలేదనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి విలన్ గా తనలోని క్రూరత్వాన్ని చూపించేందుకు రెడీ అయిపోయారు కలెక్షన్ కింగ్. నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ మూవీలో ఆయనే విలన్.

విలన్ గా మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర నటులను ఢీ కొట్టిన మోహన్ బాబు యాక్టింగ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్లు ప్లే చేశారు. ఇప్పుడు మరోసారి విలనిజం పండించడానికి రెడీ అయ్యారు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ మూవీలో మంచు మోహన్ బాబు విలన్. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన కూతురు మంచు లక్ష్మీ ఓ మూవీ ప్రెస్ మీట్ లో నోరు జారి చెప్పేశారు. ఇప్పుడు పోస్టర్ తో అఫీషియల్ గా కన్ఫామ్ అయింది.

‘ది ప్యారడైజ్’ కథా నేపథ్యం

ది ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు లుక్ ను మేకర్స్ శనివారం (సెప్టెంబర్ 27) రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ విలన్ లుక్ లో మోహన్ బాబు కనిపించారు. చేతులకు ర్తకం ఉంది. ఓ చేతిలో ఉన్న చుట్ట పొగలు కక్కుతోంది. కత్తి మీద చేయి పెట్టి, కళ్లకు అద్దాలతో కూర్చొని కనిపిస్తున్నారు మోహన్ బాబు.

‘‘గ్రేట్ హీరోలున్నారు. అలాగే గ్రేట్ విలన్లున్నారు. ఆయన అది, ఇది, అలాగే ఇంకా మరెంతో. ఆయన ఎందుకు మోహన్ బాబు అయ్యారో గుర్తుచేయడానికి మరోసారి వచ్చేస్తున్నారు. వెల్ కమ్ సార్’’ అని నాని సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు.

నాని ట్వీట్, సినిమా విడుదల వివరాలు

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంతో ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మార్చి 26, 2026న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్, షూటింగ్ వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఇందులో నాని మరింత రా అండ్ రస్టిక్ లుక్ లో, వేరే లెవల్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు.

కడుపు మండిన కాకుల కథ ఇది అంటూ అణచివేతకు గురైన ప్రజల స్టోరీని ది ప్యారడైజ్ లో చెప్పబోతున్నారు. ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విలనిజం, నాని రా అండ్ రస్టిక్ లుక్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. కడుపు మండిన కాకుల కథగా వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.