
📌 Key Points
- నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’.
- సినిమా షూటింగ్ ఇంకా 60% మాత్రమే పూర్తయింది.
- సినిమా విడుదల తేదీని మార్చి నుండి ఏప్రిల్ కు మార్చారు, కానీ మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది.
- వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది.
ది ప్యారడైజ్ సినిమాకు ఎదురవుతున్న ఆటంకాలు
The Paradise: టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’.. గతంలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే మార్చిలో రిలీజ్ అవుతుందని డేట్ ను ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఆ డేట్ ను రాలేదని చెప్పేసారు. కొన్ని కారణాల వల్ల మూవీ వాయిదా పడాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం..
నాని సినిమాలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. ఎందుకంటే ఈ మధ్య నాని నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తున్నాయి.. ఈయన చివరగా నటించిన చిత్రం హిట్ 3. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో ది ప్యారడైజ్ రాబోతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.. అందులో నిజం లేదని తెలుస్తుంది.. దీనికి కొన్ని చిక్కులు దాటాల్సిన అవసరం ఎంతైన ఉందని టాక్.. ఇప్పటిదాకా పూర్తయిన షూటింగ్ అరవై శాతం లోపేనట. ఇంకా చెప్పుకోదగ్గ భాగం పెండింగ్ ఉంది. పెద్ద ఎత్తున ఆర్టిస్టులు ఉండటంతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎక్కువ సమయం అవసరం కాబట్టి స్పీడుగా చేసినట్లు టాక్.. అలాగే పాటలు కూడా పెండింగ్ ఉన్నట్లు సమాచారం.. ఇవన్నీ దాటితే కానీ, మూవీ రిలీజ్ అవ్వడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..
షూటింగ్ ఆలస్యం కావడానికి కారణాలు
వేసవిలో విడుదల కానుందా లేదా?
ఈ మూవీని ముందుగా మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు.. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఏప్రిల్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త బయటికి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. వేసవిని మిస్ చేయకూడదనేది ప్యారడైజ్ ముందున్న టార్గెట్. ఎందుకంటే సమ్మర్ వదలుకుంటే తిరిగి ఏ దసరాకో దీపావళికో వెళ్ళాలి.. అప్పట్లో స్టార్ హీరోలు సినిమాలు చాలానే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి.. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన జైలర్ 2 తో క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ప్యారడైజ్ వీలైతే జూన్ లేదా జూలైని లక్ష్యంగా పెట్టుకోవాలి. కానీ చూస్తుంటే పరిస్థితులు అంత సులభంగా కనిపించడం లేదు.. మరి ఈ సినిమాని ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. నాని సినిమాలు విషయానికొస్తే.. హిట్ 4 సినిమా కూడా రాబోతుందని తెలుస్తుంది..
‘ది ప్యారడైజ్’ సినిమా వేసవిలో విడుదల కాకపోతే, దసరా లేదా దీపావళి వరకు వేచి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

