|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘ప్యారడైజ్’ బ్లాస్టింగ్ అప్డేట్: హీరోయిన్ ఫస్ట్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్!

Published: 11-04-2026, 3:35 AM
నాని 'ప్యారడైజ్' బ్లాస్టింగ్ అప్డేట్: హీరోయిన్ ఫస్ట్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్!
  • నాని ‘ది ప్యారడైజ్’లో కయ్యదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల: పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది!
  • దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఇదే!
  • ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో ‘ది ప్యారడైజ్’ విడుదల: మోహన్ బాబు కూడా ఉన్నారట!
  • అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కయ్యదు లోహర్ నటన!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం!

కయ్యదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాని

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ‘దసరా’ వంటి ఊర మాస్ హిట్టు తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, నాని ఈసారి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో నాని సరసన ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ కయ్యదు లోహర్ ఈ ప్రాజెక్టులో ఉందని వార్తలు వచ్చినప్పటికీ, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఈక్రమంలో.. తాజాగా నాని ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

నేడు (ఏప్రిల్ 11) కయ్యదు లోహర్ పుట్టినరోజు.. సందర్భంగా నాని ఆమెకు విషెస్ తెలుపుతూ సినిమాలో ఆమె చేస్తున్న పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో కయ్యదు సుబ్బలక్ష్మి అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడిస్తూ ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక విడుదలైన పోస్టర్‌లో కయ్యదు లోహర్ పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది. తెల్లటి షర్ట్, స్కై బ్లూ కలర్ లంగా ధరించి సైకిల్‌పై వెళ్తూ.. కనిపించి అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది. ముఖ్యంగా ఆ సైకిల్‌కు ఉన్న ఒక బ్యాగ్ చూస్తుంటే, కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని అర్థమవుతోంది. షూటింగ్ శరవేంగా జరుపుకుంటున్న ఈ ఇంటెన్స్ డ్రామా ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది. ఇక ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం.

‘ది ప్యారడైజ్’లో కయ్యదు పాత్ర ఇదే!

ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల

నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కయ్యదు లోహర్ ఫస్ట్ లుక్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.