
📌 Key Points
- నారా లోకేష్‌ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన చంద్రబాబు.
- ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాసరావు ఎన్నిక.
- పొలిట్ బ్యూరోలో కొత్తగా గంట్యాడ శ్రీదేవి, గుత్తికొండ ధనుంజయ్‌లకు అవకాశం.
- పార్టీలో పనిచేసేవారికి, విధేయులకు పెద్దపీట వేస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటన.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. నారా లోకేష్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించగా, పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీలో పనిచేసే వారికే పెద్దపీట వేస్తామని అధిష్టానం స్పష్టం చేసింది.
నారా లోకేష్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని పదవులు ఇచ్చినట్టుగా అధిష్టానం వెల్లడించింది. పనిచేసేవారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని ఇచ్చింది. మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పారు.
మంత్రి నారా లోకేష్ ను టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తనదైన వ్యూహాలతో క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్న లోకేష్‌కు ఈ బాధ్యత అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్తు బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు మరోసారి నియమితులయ్యారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్టు తెలుస్తోంది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పునర్నియామకం
29 మందితో పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పొలిట్ బ్యూరో నియామకాలు జరిగాయి. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు జరిగాయని టీడీపీ పేర్కొంది. అలాగే నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం జరిగిందని పేర్కొంది. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశామని టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసింది.
కొత్త కమిటీలలో స్థానం కల్పించిన టీడీపీ అధిష్టానం
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తానికి తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడానికి ప్రయత్నించింది. రానున్న ఎన్నికల్లో ఈ మార్పులు పార్టీకి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.


