
టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన తాజా చిత్రం సుందరకాండ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఈవెంట్ కు తన కాబోయే భార్య శిరీషతో కలిసి హాజరయ్యాడు. ఈ జంట ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.
Key Points
నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషతో కలిసి సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
ఈ జంట తమ మొదటి పబ్లిక్ అప్పీయరెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.
నారా రోహిత్ ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
నారా రోహిత్ మరియు శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది.
సుందరకాండ ప్రీ-రిలీజ్ ఈవెంట్
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ . ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది .
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ లో సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు . ఈ ఈవెంట్ లో నారా రోహిత్ , మంచు మనోజ్ సందడి చేశారు . మొదటిసారిగా నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషాతో కలిసి ఈవెంట్ కు హాజరయ్యారు . తొలిసారి ఈవెంట్ లో కాబోయే టాలీవుడ్ జంట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు .
నారా రోహిత్ మరియు శిరీష
కాగా .. ఈ ఏడాది భైరవం మూవీతో అలరించిన నారా రోహిత్ తనపెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు . ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు . అయితే నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్‌లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి.
అక్టోబర్ వివాహం
‘ప్రతినిధి 2’ సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.
నారా రోహిత్ మరియు శిరీషల జంట సుందరకాండ ఈవెంట్ లో కనిపించి అభిమానులను అలరించింది. త్వరలో వీరి వివాహం జరుగబోతున్న విషయం తెలిసిందే.


