|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిన్న బ్రేక్ తీసుకుందామనుకుంటే పెద్ద బ్రేక్ అయింది.. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌పై హీరో నారా రోహిత్ కామెంట్స్

Published: 28-05-2025, 9:46 PM
చిన్న బ్రేక్ తీసుకుందామనుకుంటే పెద్ద బ్రేక్ అయింది.. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌పై హీరో నారా రోహిత్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, మే 30న విడుదల కానున్న ‘భైరవం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Key Points

1

భైరవం సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌ల నటన.

2

నారా రోహిత్ చిన్న బ్రేక్ తీసుకున్నట్లు, కానీ అది పెద్ద బ్రేక్ అయిందని తెలిపారు.

4

రోహిత్ తదుపరి సినిమా 'సుందరకాండ' జూలైలో విడుదల కానుంది.

భైరవం సినిమా విడుదలకు సిద్ధం

టాలీవుడ్ ముగ్గురు యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం . డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం సినిమాను కెకె రాధామోహన్ నిర్మించగా.. డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించారు.

భైరవం మూవీ మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో హీరో నారా రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌పై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

నారా రోహిత్ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు

-నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ గురించి ఫోన్ చేసి చెప్పారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి చెప్పారు. నేను సినిమా చూశాను. చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్‌లో దీన్ని ఒక రస్టిక్ విలేజ్ డ్రామాలా చేశారు. దీన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టు చేంజెస్ చేయడం జరిగింది. గరుడన్ చూసిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తే ఒక ఒరిజినల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

-మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. పర్సనల్‌గా కూడా మేము చాలా క్లోజ్. మా మధ్య చాలా కంఫర్ట్ ఉంటుంది. డైరెక్టర్ విజయ్‌కి చాలా క్లారిటీ ఉంది. ఏ క్యారెక్టర్ నుంచి ఎలాంటి పర్ఫామెన్స్ కావాలో తనకి తెలుసు. మాకు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇందులో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది.

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో రోహిత్ అనుబంధం

-చిన్న బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అది కాస్త పెద్ద బ్రేక్ అయింది (నవ్వుతూ). ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు వస్తాయి. సుందరకాండ ఆల్మోస్ట్ పూర్తయింది. జూలైలో రిలీజ్ ఉండొచ్చు. నెక్ట్స్ ఫిల్మ్ ఆగస్టులో స్టార్ట్ చేయబోతున్నాను.

– మంచు మనోజ్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమాతో చాలా పర్సనల్ బాండ్ వచ్చింది. సాయి నాకు 2010 నుంచి తెలుసు. తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అప్పటినుంచి తను పరిచయం. నిజానికి సురేష్ గారితో ఒక సినిమా చేయాలి. కానీ, అది కుదరలేదు. ఈ సినిమాతో మేమంతా మరింత దగ్గరయ్యాం.

నారా రోహిత్ ఇచ్చిన ఈ కామెంట్లు భైరవం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆయన భవిష్యత్తు సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.