|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజకీయాల్లోకి నారా రోహిత్ ఎంట్రీ ఖాయమా? సంచలన ప్రకటన!

Published: 18-03-2026, 1:05 PM
రాజకీయాల్లోకి నారా రోహిత్ ఎంట్రీ ఖాయమా? సంచలన ప్రకటన!
  • నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
  • రాజకీయాల్లోకి వచ్చే సమయం వచ్చినప్పుడు వస్తానని నారా రోహిత్ స్పష్టం చేశారు.
  • ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని నారా రోహిత్ తెలిపారు.
  • రామ్మూర్తి నాయుడు సేవలను కొనియాడిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.

నారా రోహిత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. తన తండ్రి రామ్మూర్తి నాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించినప్పటికీ, రాజకీయ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

రామ్మూర్తి నాయుడు జయంతి వేడుకలు

Nara Rohith: నారా రోహిత్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే హీరోగా గుర్తింపు ఉన్న నారా రోహిత్.. ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తమ్ముడు కుమారుడనే విషయం తెలియంది కాదు. పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయినా నారా ఫ్యామిలీ (Nara Family)‌ నుంచి, ఈ హీరో కూడా రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, హీరో నారా రోహిత్ (Nara Rohith) తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు (Nara Ramamurthy Naidu) ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నారా రోహిత్ మాట్లాడుతూ, తన తండ్రి గురించి ఎంతో భావోద్వేగంగా స్పందించారు.. ‘‘నాన్న మా మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఆయనతో అనుబంధం ఉన్నవాళ్లంతా ఏదో ఒక మెమెరీ షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. నాన్న, పెద్దనాన్నల మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా ఎంతో లేదు. ఇద్దరూ ఎప్పుడూ అందరినీ కలుపుకుని వెళ్లేవాళ్లు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. నాన్న దగ్గర నుంచి కూడా మేము అదే నేర్చుకున్నాం. అందరినీ కలుపుకుని వెళ్లాలి అని చెప్పేవారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మా కుటుంబంపై ఉంటాయని నమ్ముతున్నాను. అందరూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

రాజకీయాలపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు నారా రోహిత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.. ‘‘రాజకీయాల్లోకి వచ్చే సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉన్నప్పటికీ, రాజకీయ ప్రవేశంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని ఆయన హింట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారా రామ్మూర్తి నాయుడు ఫ్యామిలీతో పాటు స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రామ్మూర్తి నాయుడు సేవలను కొనియాడారు. మరోవైపు తన తమ్ముడి జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిత్వం రామ్మూర్తి నాయుడు సొంతం. భౌతికంగా మాకు దూరమైనా… మా మనసుల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా ఎప్పటికి ఉంటాడు’’ అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిత్వం రామ్మూర్తి నాయుడు సొంతం. భౌతికంగా మాకు దూరమైనా… మా మనసుల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా ఎప్పటికి… pic.twitter.com/yigWUbUoXX

సినిమాలపైనే ప్రస్తుత దృష్టి

— N Chandrababu Naidu (@ncbn) March 18, 2026

నారా రోహిత్ రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ, సరైన సమయంలో వస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన అభిమానులు ఆయన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.