|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సిరితో ఏడడుగులు వేసేది అప్పుడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్

Published: 31-05-2025, 5:21 AM
సిరితో ఏడడుగులు వేసేది అప్పుడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్

‘భైరవం’ సినిమాతో మంచి విజయం సాధించిన నారా రోహిత్, తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు. అతను ఈ ఏడాది అక్టోబర్‌లో సిరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. ఈ వార్తతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Key Points

1

నారా రోహిత్ తన విజయవంతమైన ‘భైరవం’ సినిమా తర్వాత పెళ్లి విషయం వెల్లడించాడు.

2

అక్టోబర్ లో సిరితో ఏడడుగులు వేయబోతున్నట్లు ప్రకటించాడు.

4

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుందని రోహిత్ తెలిపాడు.

‘భైరవం’ తర్వాత రోహిత్ గుడ్ న్యూస్

చాలా రోజుల తర్వాత హీరో నారా రోహిత్(Nara Rohit) విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో వచ్చిన ‘భైరవం’(Bairavam) మూవీతో మన ముందుకు వచ్చాడు. అతనితో పాటు బెల్లం కొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj) కూడా హీరోలుగా నటించారు. ఇక ఆనంది(Anandi), అదితీ శంకర్(Aditi Shankar), దివ్యా పిళ్లై(Divya Pillai) హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నారా రోహిత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక అతనికి మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్‌లో పెళ్లి

కాగా ఈ సినిమా కోసం అతను గట్టిగానే కష్టపడ్డాడు . ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటూ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన పెళ్లి గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది అక్టోబర్‌లో సిరిని పెళ్లి చేసుకోబోతున్నాను. హిందూ సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది’ అని నారా వారి హీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

నిశ్చితార్థం తర్వాత వాయిదా

కాగా ‘ప్రతినిధి-2’(Prathinidhi-2) సినిమాలో హీరో నారా రోహిత్‌ సరసన శిరీష(Sirisha) నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇక ఇరు కుంటుంబాలను ఒప్పించి గతేడాది అక్టోబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇప్పటికే నారా రోహిత్‌-సిరిల పెళ్లి జరగాల్సి ఉండగా.. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్‌లో కన్నుమూశారు. దీంతో తమ పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నాడు.

నారా రోహిత్ అక్టోబర్‌లో సిరిని వివాహం చేసుకోబోతున్నాడని ప్రకటించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ‘భైరవం’ సినిమా విజయం తర్వాత ఈ శుభవార్త అభిమానులకు మరింత సంతోషాన్ని చేకూర్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.