
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి మోదీ ఆశీస్సులు – వేడుక రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా!
- ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ – టాలీవుడ్ సెలబ్రిటీల సందడి!
- ప్రధాని మోదీ ప్రత్యేక సందేశం – ‘సప్తపది’తో కొత్త జీవితానికి శుభాకాంక్షలు!
- విజయ్, రష్మిక కుటుంబాలకు మోదీ అభినందనలు – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభాకాంక్షల లేఖ!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. వీరి వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శుభాకాంక్షలు తెలుపడంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది.
విజయ్, రష్మిక పెళ్లికి మోదీ ఆశీస్సులు!
Narendra Modi; టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం గ్రాండ్ గా జరుగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్ళికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అన్ని ముగిశాయి. మరికొన్ని గంటల్లో ఈ పెళ్లి తంతు కానుంది. విజయ్, రష్మిక ఒకటికానున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్-రష్మిక జంటకు అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వయంగా ఈ జంటకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు ఒక నోట్ విడుదల చేశారు.
‘విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల జీవితంలో ఇది కొత్త అధ్యాయానికి నాంది. ‘సప్తపది’ అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు వేసి జీవితకాలం స్నేహితులుగా, తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ సందేశాన్ని పంపారు మోదీ. అలాగే విజయ్ మరియు రష్మిక కుటుంబాలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్!
మోదీ సందేశం వైరల్ – టాలీవుడ్‌లో సందడి!
ప్రధాని మోదీ స్వయంగా విజయ్, రష్మికలకు శుభాకాంక్షలు తెలపడంతో ఈ వార్త సంచలనంగా మారింది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


