
సీనియర్ నటుడు నరేష్, కిరణ్ అబ్బవరం సినిమా ‘కే ర్యాంప్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టెప్పులతో అదరగొట్టారు. బ్లాక్ డ్రెస్సులో మెరిసిన నరేష్, కామ్నా జెఠ్మలానీ, విమల రామన్ లతో కలిసి ఆడిపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Key Points
సీనియర్ నటుడు నరేష్ ఇద్దరు హీరోయిన్లతో స్టేజ్ పైనే స్టెప్పులేశారు.
కిరణ్ అబ్బవరం నటించిన 'కే ర్యాంప్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది.
కామ్నా జెఠ్మలానీ, విమల రామన్ లతో కలిసి నరేష్ డ్యాన్స్ చేశారు.
నరేష్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నరేష్ స్టెప్పులతో సందడి
దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు నరేష్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రల్లో కనిపిస్తూ… జనాలను బాగా ఎంటర్ టైన్ చేస్తాడు. ఆయన స్క్రీన్ పైన కనిపించాడు అంటే కచ్చితంగా కామెడీ పండుతుంది. అయితే అలాంటి నటుడు నరేష్, తాజాగా స్టేజ్ పైనే స్టెప్పులు వేశారు. అది కూడా ఇద్దరు హీరోయిన్లతో ఆడి పాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా చేసిన మూవీ కే ర్యాంప్ ( K-Ramp). ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర బృందం. అయితే ఈ ఈవెంట్ లో బ్లాక్ డ్రెస్ లో మెరిసిన నరేష్… స్టేజ్ పైన సందడి చేశాడు. అంతేకాదు కామ్నా జెఠ్మలానీ, విమల రామన్ తో స్టెప్పులు కూడా వేశాడు నరేష్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా నటిస్తున్నారు. విజయ కృష్ణ నరేష్, వెన్నెల కిషోర్, అలీ బాషా కామ్నా జెఠ్మలానీలు ప్రత్యేక పాత్రలలో మెరువనున్నారు. క్లిక్
ఏ ఈవెంట్‌లో నరేష్ స్టెప్పులు?
వైరల్‌గా మారిన వీడియో
సీనియర్ నటుడు నరేష్ ఎప్పుడూ తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లతో కలిసి స్టేజ్ పై చేసిన స్టెప్పులు ఆయన అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


