
📌 Key Points
- శర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ!
- ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం!
- సంయుక్త మీనన్, సాక్షి వైద్య గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకున్న చిత్రం!
- రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్!
టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇప్పుడు మీ ఇంటికే రానుంది. ఇక పండగే పండగ!
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nari Nari Naduma Murari OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. సామజవరగమన మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు. సినిమా సంక్రాంతి కానుకగా యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది.
శర్వానంద్ కెరీర్ బెస్ట్ మూవీ ఇదేనా?
చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న శర్వానంద్ కి సూపర్ హిట్ అందించింది ఈ సినిమా. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. అయితే, తాజాగా నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari OTT) సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
యూత్ ను మెప్పించిన కామెడీ ఎంటర్టైనర్!
నారీ నారీ నడుమ మురారి సినిమాను ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సంక్రాంతి పోటీ వల్ల థియేటర్స్ లో ఈ సినిమాను చాలా మంది చూడలేకపోయారు. కాబట్టి, ఓటీటీలో ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశమ్ ఉంది. చూడాలి మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అని.
నారీ నారీ నడుమ మురారి సినిమా ఓటీటీ రిలీజ్ తో ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


