|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నరివెట్ట రివ్యూ.. ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. పోలీసుల దౌర్జ్యన్యాన్ని కళ్లకు కట్టిన మూవీ.. నిజ జీవిత ఘటన ఆధారంగా..

Published: 10-07-2025, 12:21 PM
నరివెట్ట రివ్యూ.. ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. పోలీసుల దౌర్జ్యన్యాన్ని కళ్లకు కట్టిన మూవీ.. నిజ జీవిత ఘటన ఆధారంగా..

2003 కేరళలోని ఆదివాసీల ఉద్యమం, పోలీసుల దౌర్జన్యం నేపథ్యంలో తెరకెక్కిన నరివెట్ట సినిమా, ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించాడు.

Key Points

1

నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్.

2

పోలీసుల దౌర్జన్యం, ఆదివాసీల పోరాటాన్ని చూపించే కథ.

4

సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

నిజ జీవిత ఘటన ఆధారంగా

నరివెట్ట అంటే తెలుగులో నక్కల వేట అని అర్థం. 2003లో కేరళలోని వయనాడ్ లో జరిగిన ఆదివాసీల ఉద్యమం, దానిని అణచివేయడానికి అప్పటి ప్రభుత్వం, పోలీసులు చేసిన దారుణాలను కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ఇది. ఈ ఏడాది మే 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. గురువారం (జులై 10) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

డైరెక్టర్: అనురాజ్ మనోహర్

నటీనటులు: టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ తదితరులు

స్టోరీ: 2003లో కేరళలో జరిగిన ముత్తాంగ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

పోలీసుల దౌర్జన్యం

నరివెట్ట మూవీని అనురాజ్ మనోహర్ తెరకెక్కించాడు. కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించి అతడు పెద్ద సాహసమే చేశాడు. 2003, ఫిబ్రవరి 19న తమకు ప్రభుత్వం ఇస్తామన్న భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడం, కాల్పులు జరపడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆధారంగా నరివెట్ట సినిమాను రూపొందించారు.

ఇది కానిస్టేబుల్ పీటర్ వర్గీస్ ( టొవినో థామస్ ) చుట్టూ తిరిగే కథ. కేరళలోని వయనాడ్ లో ఉన్న అడవుల్లో ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయడానికి వెళ్లిన పోలీసు బలగాల్లో అతడు కూడా ఒకడు. అక్కడే పోలీస్ డిపార్ట్‌మెంట్ లో తన గురువుగా, శ్రేయోభిలాషిగా భావించే హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ (సూరజ్ వెంజరమూడు)ను కోల్పోతాడు. అయితే దాని వెనుక ఉన్న కుట్రను అతడు ఛేదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పీటర్ వర్గీస్ ఆ ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని ఎలా బయటి ప్రపంచానికి తెలియజేస్తాడు? ఈ కుట్రలో భాగమైన వాళ్లు ఎవరు అన్నదే నరివెట్ట మూవీ స్టోరీ.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓ నిజ జీవిత ఘటన.. అందులోనూ ఎంతో మంది పెద్దపెద్ద వాళ్లు ఇన్వాల్వ్ అవడం.. ఇలాంటి స్టోరీని ఎంచుకొని తెరపై చూపించడమే ఓ పెద్ద సాహసం. కానీ డైరెక్టర్ అనురాజ్ మనోహర్ ఆ ధైర్యం చేశాడు. అంతేకాదు ఆనాటి ఘటన, పోలీసుల దౌర్జన్యం, ఆదివాసీల దుర్బల జీవితాలను అతడు కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు అద్భుతమనే చెప్పాలి.

టొవినో థామస్ నటన

సినిమాలోని కొన్ని సీన్లు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తాయి. ఓ సాధారణ కానిస్టేబుల్.. మొత్తం వ్యవస్థనే ఎదిరించి ఓ పెద్ద కుట్రను బయటపెట్టిన తీరును కూడా ఆకట్టుకునే కథనంతో ఎంతో ఆసక్తికరంగా మలిచారు. ఇక ఈ సినిమాలో కానిస్టేబుల్ పీటర్ వర్గీస్ పాత్రలో టొవినో థామస్ జీవించేశాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ బీజీఎం కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

నరివెట్ట 22 ఏళ్ల కిందట కేరళలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనపై తెరకెక్కిన సినిమా. సాధారణంగా ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ సాధించడం అరుదు. కానీ నరివెట్ట మాత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా విజయం సాధించింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సుమారు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసింది.

ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న నరివెట్ట ఓ మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదో మస్ట్ వాచ్ మూవీ.

నరివెట్ట, ఓ నిజ జీవిత ఘటనను తెరపైకి తీసుకొచ్చిన ధైర్యవంతమైన చిత్రం. అద్భుతమైన నటన, కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.