|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Narne Nithiin Wife: పెళ్లి కూతురు ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Published: 11-10-2025, 8:35 AM
Narne Nithiin Wife: పెళ్లి కూతురు ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్ లక్ష్మీ శివానితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నితిన్ భార్య లక్ష్మీ శివాని బ్యాక్ గ్రౌండ్, ఆమె దగ్గుబాటి కుటుంబంతో ఉన్న సంబంధం ఈ కథనంలో తెలుసుకోండి.

Key Points

1

హీరో నార్నే నితిన్ లక్ష‍్మీ శివానిని వివాహం చేసుకున్నారు.

2

లక్ష‍్మీ శివాని దివంగత రామానాయుడు మనవరాలు, దగ్గుబాటి కుటుంబానికి దగ్గరి బంధువు.

4

నార్నే నితిన్ 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందారు.

లక్ష్మీ శివాని బ్యాక్ గ్రౌండ్ ఇదే!

ఎన్టీఆర్ బావమరిది, హీరో నార్నే నితిన్ పెళ్లి చేసుకున్నాడు. లక్ష‍్మీ శివాని అనే అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శంకరపల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లి కొడుకు ఎవరనేది అందరికీ తెలుసు. తారక్ భార్య లక్ష‍్మీ ప్రణతికి సొంత తమ్మడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ తదితర చిత్రాలతో హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరి పెళ్లి కూతురు ఎవరు ఏంటనేది మాత్రం పెద్దగా తెలియదు. అయితే ఈ పెళ్లిలో హీరో వెంకటేశ్ కుటుంబం కూడా కనిపించడంతో అమ్మాయికి వీళ్లకు బంధుత్వం ఏంటా అని అందరూ అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు లక్ష‍్మీ శివానిది నెల్లూరు. కానీ వ్యాపారరీత్యా ఈమె తండ్రి కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో ఉన్నారు. దీంతో లక్ష‍్మీ శివాని.. చదువంతా భాగ్యనగరంలోనే పూర్తి చేసింది. అయితే దగ్గుబాటి కుటుంబంతో వీళ్లకు బంధుత్వం ఉంది. దివంగత రామానాయుడికి ఈమె మనవరాలు అవుతుంది. అంటే వెంకటేశ్, సురేశ్ బాబుకు కూతురు వరస అవుతుంది.

దగ్గుబాటి ఫ్యామిలీతో బంధుత్వం

అందుకే నార్నే నితిన్-శివాని పెళ్లిలో దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, నాగచైతన్య తదితరులు సందడి చేశారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఈ వివాహ వేడుకలో కనిపించారు. గతేడాది నవంబరులో నితిన్-శివానిల నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి జరిగింది.

నార్నే నితిన్ కెరీర్, భవిష్యత్ ప్రణాళికలు

నార్నే నితిన్ విషయానికొస్తే.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్, శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాలతో వచ్చాడు. ప్రస్తుతానికైతే ఇతడి చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెళ్లయింది కాబట్టి కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేసి త్వరలో కొత్త చిత్రాల్ని ప్రకటిస్తాడేమో చూడాలి!

నార్నే నితిన్, లక్ష్మీ శివాని పెళ్లి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి, నందమూరి కుటుంబాల కలయికతో ఈ వివాహానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ కొత్త జంట భవిష్యత్తు ప్రణాళికలు, నితిన్ తదుపరి చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.