
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ నటించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా చివరకు విడుదలకు సిద్ధమైంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది.
Key Points
నార్నె నితిన్ నటించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా జూన్ 6న విడుదల.
సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కెరీర్లో మరో సినిమా.
భారీ తారాగణంతో తెరకెక్కిన ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా విడుదల తేదీ
Narne Nithiin : ఎన్టీఆర్ బామ్మర్దిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్.. సినిమాలతో వరుస హిట్స్ కొట్టాడు. అయితే నార్నె నితిన్ నటించిన మొదటి సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు మాత్రం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నార్నె నితిన్ సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ కి రెడీ అయింది.
శతమానం భవతి ఫేమ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్, సంపద జంటగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా తెరకెక్కింది. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్ పై చింతపల్లి రామారావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్
శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ చూస్తుంటే.. సిగరెట్ లకు అలవాటైన హీరో అమ్మాయి కోసం, తండ్రి కోసం సిగరెట్ మానేయాల్సి వస్తే ఏం జరిగింది అని గోవారి బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్ మీరు కూడా చూసేయండి..
ట్రైలర్ లంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ఈ సినిమాలో నరేష్ గారు ఒక డైలాగ్ చెప్తారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే. ఈ కాన్సెప్ట్ తోనే సినిమాను తీసాం. నా సినిమాల్లో ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం మన కుటుంబాల్లో ఎక్కువమంది ఉన్నట్టే. మరుగున పడిన కొన్నింటిని చూపించాలనే నా మూవీస్ ద్వారా తాపత్రయ పడుతుంటాను అని తెలిపారు.
నార్నె నితిన్ కెరీర్ మరియు సినిమా వివరాలు
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కించాం. జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు తో మరో హిట్ పడుతుంది అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, జబర్దస్త్ నాగి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
చివరగా, నార్నె నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ సినిమా జూన్ 6న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.


