|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ది ప్యారడైజ్’ మూవీలో నేషనల్ అవార్డు విన్నర్.. అధికారిక ప్రకటన విడుదల

Published: 03-11-2025, 5:54 AM
‘ది ప్యారడైజ్’ మూవీలో నేషనల్ అవార్డు విన్నర్.. అధికారిక ప్రకటన విడుదల

నాచురల్ స్టార్ నాని గత చిత్రం ‘దసరా’ విజయం తర్వాత, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ తో సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో జాతీయ అవార్డు గ్రహీత సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Key Points

1

‘ది ప్యారడైజ్’ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత సోనాలి కులకర్ణి కీలక పాత్ర.

2

నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయ్యదు లోహర్ ప్రధాన తారాగణం.

4

8 భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

జాతీయ అవార్డు గ్రహీత సోనాలి కులకర్ణి

నేచురల్ స్టార్ నాని(nani), శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ‘ది ప్యారడైజ్’ (The Paradise)టైటిల్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మూవీ మేకర్స్ నిత్యం పలు అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాలో ఓ జాతీయ అవార్డు గ్రహీత నటించబోతున్నట్లు ప్రకటించారు. నేడు సోనాలి కులకర్ణి (Sonali Kulkarni)పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విషెష్ తెలుపుతూ.. ‘ది ప్యారడైజ్’ మూవీ టీమ్ పోస్ట్ పెట్టారు. ‘రా స్టేట్‌మెంట్: గ్లింప్స్’లో ఆమె స్వరం ఇంటర్నెట్‌‌లో తుఫానుగా మార్చింది.

ఈ చిత్రంలో ఆమె నటన ఒక సంచలనం అవుతుందని తెలిపారు. అలాగే గ్లీన్ కలర్ చీరలో నగలు వేసుకున్న గార్జియస్ ఫొటోను షేర్ చేశారు. కాగా.. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. కయ్యదు లోహర్, నాని సరసన రొమాన్స్ చేయనుంది. అనిరుధ్ రవిచందర్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలి, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం 8 భాషల్లో విడుదల కాబోతుంది. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గ్రాండ్‌గా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ది ప్యారడైజ్’ స్టార్ కాస్ట్, సాంకేతిక నిపుణులు

8 భాషల్లో భారీ రిలీజ్ డేట్

మోహన్ బాబు, అనిరుధ్ వంటి దిగ్గజాలతో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న 8 భాషల్లో విడుదల కానుంది. ఈ భారీ మల్టీలింగువల్ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.