
📌 Key Points
- నవీన్ చంద్ర షాకింగ్ లుక్‌తో ‘హనీ’ టీజర్ విడుదల!
- ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానున్న ‘హనీ’ చిత్రం!
- దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తుండగా.. దివి, రాజా రవీంద్ర కీలక పాత్రలు!
- నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్!
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరోసారి తన నట విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి ‘హనీ’ అనే డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
భయానకంగా నవీన్ చంద్ర లుక్!
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర(Naveen Chandra) ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్(Karuna Kumar)తో కలిసి మరో ప్రయోగాత్మక చిత్రం‘హనీ’(Honey) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాల భయానక కోణాన్ని చూపించనున్నారు. ఇందులో దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తుండగా..దివి, రాజా రవీంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తుండగా.. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు మూవీ మేకర్స్ వరుస అప్డేట్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘హనీ’ టీజర్‌ను నవీన్ చంద్ర షేర్ చేశాడు. ఇందులో అడవిలో క్షుద్రపూజలు, భయంకర విజువల్స్‌తో నవీన్ చంద్ర షాకింగ్ లుక్‌లో కనిపించారు. మొత్తానికి ‘హనీ’టీజర్ ప్రేక్షకులకు వణుకుపుట్టేలా చేసింది. “నిశ్శబ్దం అతి పెద్ద భయాన్ని కలిగిస్తుంది.. ఈ ఏడాది అత్యంత వినాశకరమైన ఆచారం మొదలైంది” అనే క్యాప్షన్‌తో మిస్టరీని మరింత పెంచింది.
‘హనీ’ టీజర్ విడుదల చేసిన నవీన్!
ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల!
మొత్తానికి ‘హనీ’ టీజర్ ఒక సంచలనం సృష్టిస్తుంది. సినిమా విడుదల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


