|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నవీన్ చంద్ర ‘నాట్ ఎ డాక్టర్’: టైటిల్‌తోనే షాకింగ్ ట్రీట్‌మెంట్! పోస్టర్ వైరల్!

Published: 15-02-2026, 1:35 PM
నవీన్ చంద్ర 'నాట్ ఎ డాక్టర్': టైటిల్‌తోనే షాకింగ్ ట్రీట్‌మెంట్! పోస్టర్ వైరల్!
  • నవీన్ చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో ‘నాట్ ఎ డాక్టర్’ మూవీ!
  • స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణం!
  • ‘భానుమతి & రామకృష్ణ’ కాంబో రిపీట్.. మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు!
  • మిస్టరీతో నిండిన టైటిల్ పోస్టర్ విడుదల.. అంచనాలు పెంచే ట్యాగ్‌లైన్!

నవీన్ చంద్ర హీరోగా వస్తున్న ‘నాట్ ఎ డాక్టర్’ మూవీ టైటిల్ పోస్టర్ విడుదలైంది. టైటిల్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ చిత్రం స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రానుంది.

వైరల్ అవుతున్న ‘నాట్ ఎ డాక్టర్’ టైటిల్ పోస్టర్

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌పై మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి బలమైన, కంటెంట్-బేస్డ్ చిత్రాలకు నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. ‘భానుమతి & రామకృష్ణ’, ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడం ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న కొత్త మూవీకి ‘నాట్ ఎ డాక్టర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అడవి నేలలో నుంచి బయటికి వస్తున్న మట్టితో తడిసిన భారీ చేయి పోస్టర్‌లో కనిపిస్తూ, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోంది. చుట్టూ పెరిగిన మాస్‌ రూట్స్‌, ఆకులు, ఎత్తైన చెట్ల నేపథ్యం కలిపి మిస్టరీతో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. “Based on a novel that was never written” అనే ట్యాగ్‌లైన్ కథలో అద్భుతమైన భావోద్వేగాలు ఉంటాయని సూచిస్తోంది. ఇందులో నవీన్ చంద్ర ఒక విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోనుండగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ త్వరలోనే తెలియనున్నాయి.

నవీన్ చంద్ర న్యూ మూవీ.. స్టోరీ ఇదేనా?

శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో మరో హిట్ మూవీ?

నవీన్ చంద్ర ‘నాట్ ఎ డాక్టర్’ మూవీ టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.