📌 Key Points
- నవీన్ చంద్ర ‘హనీ’ చిత్రంలో భయంకరమైన అవతారంలో కనిపించారు.
- కరుణ కుమార్ దర్శకత్వంలో ఇది ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.
- నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలపై ఈ చిత్రం రూపొందింది.
- ‘హనీ’ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల కానుంది.
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర ‘హనీ’ అనే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌తో రానున్నాడు. ఈ చిత్రం గ్లింప్స్ లో ఆయన భయంకరమైన అవతారంలో కనిపించి అందరినీ షాక్ చేసింది. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. నవీన్ చంద్ర లుక్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
‘హనీ’ గ్లింప్స్: భయపెట్టిన నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra) తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకవైపు విలన్‌గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస అవకాశాలు అందుకుంటూనే… హీరోగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆయన ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’(HONEY) మూవీతో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. ఈ చిత్రానికి ‘పలాస 1978’ వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర సరసన దివ్య పిళ్లై (Divya Pillai)హీరోయిన్‌గా నటిస్తుండగా.. దివి, రాజా రవీంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తుండగా.. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిని ఈ చిత్రంలో సమాజంలోని మూఢనమ్మకాలు, అంధ నమ్మకాలను డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో రూపొందించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రబృందం, న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా ‘హనీ’ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ప్రారంభంలో పిల్లుల భయంకరమైన శబ్దాలు వినిపించడంతోనే హారర్ టోన్ సెట్ అయింది. అనంతరం నవీన్ చంద్ర పూజ చేస్తూ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. క్షణాల్లోనే అతని లుక్ పూర్తిగా మారిపోవడం, నాలుక బయటకు పెట్టి కళ్లు వింతగా తిప్పుతూ కనిపించడం ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసింది. గ్లింప్స్ చివర్లో భయానకంగా కనిపించే ఓ కన్ను విజువల్, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే నవ్వు సౌండ్ మరింత ఉత్కంఠను పెంచాయి. మొత్తంగా ఈ గ్లింప్స్ సినిమాపై హైప్‌ను ఒక్కసారిగా పెంచేశాయి. నవీన్ చంద్రను ఇంత డార్క్, ఇంత భయంకరమైన అవతారంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
‘హనీ’ మూవీ విశేషాలు: దర్శకుడు, తారాగణం
సైకలాజికల్ హారర్ గా ‘హనీ’ కథా నేపథ్యం
నవీన్ చంద్ర భయంకర అవతారంతో ‘హనీ’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, నవీన్ చంద్ర నటనతో ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.


